ముదురుతున్న అంబికా కృష్ణ, ఏఎస్ రవికుమార్‌ల మధ్య వివాదం
Send us your feedback to audioarticles@vaarta.com
‘వీరభద్ర’ సినిమా దర్శకుడు ఏఎస్ రవి కుమార్ చౌదరి, ఆ సినిమా నిర్మాత అంబికా కృష్ణల మధ్య వివాదం ముదురుతోంది. ఏఎస్ రవి కుమార్ చౌదరి పరమ నీచుడు, దుర్మార్గుడు అంటూ నిర్మాత అంబికా కృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల ఓ ప్రముఖ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘వీరభద్ర’ హీరో నటరత్న నందమూరి బాలకృష్ణతో ఉన్న అనుబంధం గురించి తెలియా జేస్తూ వీరభద్ర సినిమా గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఏఎస్ రవికుమార్ గురించి అంబికా కృష్ణ మాట్లాడుతూ.. వీరభద్ర సినిమా అంత దారుణంగా ఫ్లాప్ అవడానికి దర్శకుడు కారణమని, ఆయనంత నీచుడు, దుర్మార్గుడు ఎవరు ఉండరని అన్నారు. అతనివల్లే అంత పెద్ద ఫెయిల్యూర్ వచ్చిందన్నారు. చెప్పిన కథ ఒకటి, చేసిన స్క్రిప్ట్ ఒకటి.. అనుకున్న బడ్జెట్ ఒకటి.. ఖర్చు పెట్టించింది మరొకటి.. ఒళ్లు పొగరుతో.. అహంకారంతో సినిమాని నాశనం చేశాడని అంబికా కృష్ణ పేర్కొన్నారు. రోజూ మందు తాగి షూటింగ్ చేసేవాడు.. ఎన్ని సార్లు మందలించినా మారలేదు.
అంబికా కృష్ణ వ్యాఖ్యలకు దర్శకుడు ఏఎస్ రవికుమార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అంబికా కృష్ణ కథలు బాగా చెప్తాడని.. తనను హీరోగా పెట్టుకుని సినిమా చేస్తే బాగుంటుందని సెటైర్లు వేశారు. ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే.. గుంటూరోడి దెబ్బ ఏంటో చూస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను షూటింగ్‌కి తాగి వచ్చేవాడినే అయితే తనతో అన్ని సినిమాలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. తానంత మూర్ఖుడ్ని కానని.. పెద్ద పెద్ద నిర్మాతలు తనతో సినిమాలు ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా తనపై కంప్లైంట్ చేయాలనుకుంటే దిల్ రాజు, అరవింద్‌కి అర్హత ఉందన్నారు. ఎందుకంటే తమ మధ్య చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయన్నారు. అంబికా కృష్ణ కామెంట్స్‌తో తాను బాధపడ్డానన్నారు. నిజంగా ఆయన డబ్బులు పోయాయి కాబట్టి బాధ ఉంటుంది. కానీ కొన్నిసార్లు మంచి సినిమాలు కూడా పోతాయన్నారు.
భవ్య క్రియేషన్స్‌తో.. సి కళ్యాణ్‌తో లాంగ్ జర్నీ చేస్తున్నానని... తాను తాగి షూటింగ్‌లకు వస్తే వాళ్లు తనతో మళ్లీ మళ్లీ పనిచేస్తారా? అని ఏఎస్ రవికుమార్ ప్రశ్నించారు. అంబికా కృష్ణ చెప్పేవన్నీ వాస్తవం కాదన్నారు. ఆయనంటే తనకు గౌరవమన్నారు. ఎందుకంటే ఆయన తనకు మంచి సినిమా ఇచ్చాడన్నారు. ఆయన్ని చూస్తుంటే నాకు కోపం రాదని.. నవ్వు వస్తుందని.. ఆయన గెటప్, కళ్లజోడు ఇవన్నీ చూస్తే నవ్వు వస్తుందని ఏఎస్ రవికుమార్ పేర్కొన్నారు. ఆయన ఎక్కడో హర్ట్ అయ్యాడని... డబ్బు పెట్టాడు కాబట్టి బాధ ఉంటుందన్నారు. నిర్మాత, దర్శకుల మధ్య చిన్న చిన్న గొడవలు ఉంటాయి కానీ.. ఇలా బయటపెట్టి రాద్ధాంతం చేయకూడదని హితవు పలికారు. వివాదం చేయాలని తాను అనుకోవడం లేదని. దీన్ని ఇంకా లాగదల్చుకోలేదన్నారు. తనను వాడు వీడు అని మాట్లాడారన్నారు. నాకేదో బొడ్డుకోసిన మేనమామలా మాట్లాడుతున్నారు. అయితే తాను పాజిటివ్‌గానే తీసుకున్నానని.. ఇదే మాట వేరే వాడు అంటే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments