జూన్ 17న విడుదలవుతున్న 'కంట్రోల్ సి'
Send us your feedback to audioarticles@vaarta.com
సెకండ్ ఇండిపెండెన్స్ పతాకంపై సాయిరామ్ చల్లా దర్శకత్వంలో తాటిపర్తి ప్రభాకర్ నిర్మించిన సినిమా 'కంట్రోల్ సి'. అశోక్, దిశాపాండే జంటగా నటించారు. ఈ సినిమా జూన్ 17న విడుదలవుతోంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అభిషేక్ పిక్చర్స్ ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశానికి దర్శకుడు సుకుమార్ ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బెనర్జీ, చంద్రమహేష్, సమీర్ తదితరులతో పాటు దర్శక, నిర్మాతలు.. యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. "ఏ సినిమాకి పని చేయకుండా, ఒక్క షార్ట్ ఫిల్మ్ కూడా తీయకుండా దర్శకుడు సాయిరాం ఈ సినిమా చేయడం చిన్న విషయం కాదు. ముందుగా ఈయన ఓ పెద్ద కథ చెప్పారు. ఆ సినిమాకి భారీ బడ్జెట్ అవసరం. అలా కాకుండా ముందుగా లో బడ్జెట్లో ఓ సినిమా చేయమని చెప్పాను. అలా రూపొందిన చిత్రమే కంట్రోల్ సి. ట్విన్ టవర్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సాఫ్ట్ వేర్ థ్రిల్లర్ ఇది. సాయిరాం అనుభవమున్న దర్శకుడిలా తీశారు. సినిమాలో నైట్ ఎఫెక్ట్స్ చాలా థ్రిల్లింగ్ కు గురి చేస్తాయి. అలాగే.. దర్శకుడు కావాలనే ఓ ఫ్రెండ్ కలను మరో ఫ్రెండ్ నెరవేర్చడం గొప్ప విషయం. సాయిరామ్ చల్లా డ్రీమ్ ను ప్రభాకర్ గారు నిర్మాతగా పూర్తి చేశారు. ఖర్చుకు వెనకాడకుండా సినిమా రూపొందించారు. భారీ సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేసే అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నందుకు థాంక్స్. జూన్ 17న విడుదలవుతున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
దర్శకుడు సాయిరామ్ చల్లా మాట్లాడుతూ.. "నాకు సినిమా అంటే సుకుమార్ గారే. 'ఆర్య' సినిమా నుండి ఆయనతో పరిచయం ఉంది. సుకుమార్ వలనే నేను సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను. ఈ సినిమాతో దర్శకుడిగా మారాను. దీనికి కారణం నా మిత్రుడు ప్రభాకర్. అతను మిత్రుడు కంటే ఎక్కువ. మా కుటుంబ సభ్యులు కూడా చేయనంత ఎక్కువ అండగా నిలబడ్డాడు. నా ఫ్యాషన్, గోల్ ను తన ఫ్యాషన్, గోల్ గా మార్చుకున్నాడు. సినిమా పూర్తయింది. పెద్ద హీరోల సినిమాలను విడుదల చేస్తున్న అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ ముగ్గురికీ నా థాంక్స్. సుకుమార్ సలహా మేరకు లో బడ్జెట్లో 'కంట్రోల్ సి' తీశాను. రెగ్యులర్ ఫార్మాట్ కు భిన్నంగా ఉంటుంది. కథే హీరో. క్యారెక్టర్స్ ను స్క్రిప్ట్ నడిపిస్తుంది. ట్విన్ టవర్స్ ప్రమాదం నుండి తప్పించుకున్న హీరో హీరోయిన్ కు ఓ వీడియో టేప్ దొరుకుతుంది. దాంతో వారు ఇండియా వచ్చేస్తారు. ఇండియాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా చేరుతారు. కానీ ఆ వీడియో టేప్ వల్ల ఇండియాలో వాళ్లు ఎదుర్కొన్న పరిస్థితులేంటనేదే ఈ సినిమా కథ. ప్రతి సీన్ డిఫరెంట్ గా అంచనాలకు అందకుండా ఉంటుంది. చంద్రమౌళి సినిమాటోగ్రఫీ హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది. ప్రేక్షకులను ఢిఫరెంట్ థ్రిల్లింగ్ కు గురి చేసే చిత్రమిది`` అన్నారు.
నిర్మాత తాటిపర్తి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. "ఇప్పటివరకూ సాఫ్ట్ వేర్ జోనర్ లో తెరకెక్కిన సినిమాలు అన్నిటిలో కల్లా కంప్లీట్ డిఫరెంట్ మూవీ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా దర్శకుడు సినిమా తీశారు. మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. జూన్ 17న విడుదల చేస్తున్నాం. మా సినిమాని పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com