డిఫరెంట్ సాఫ్ట్ వేర్ థ్రిల్లర్ కంట్రోల్ సి - డైరెక్టర్ సాయిరామ్ చల్లా
Send us your feedback to audioarticles@vaarta.com
అశోక్, దిశా పాండే జంటగా నూతన దర్శకుడు సాయిరామ్ చల్లా తెరకెక్కించిన చిత్రం కంట్రోల్ సి. ఈ చిత్రాన్ని సెకండ్ ఇండిపెండన్స్ బ్యానర్ పై ప్రభాకర్ రెడ్డి నిర్మించారు. డిఫరెంట్ థ్రిల్లర్ మూవీగా రూపొందిన కంట్రోల్ సి చిత్రం ఈనెల 17న రిలీజ్ అవుతుంది.
ఈ సందర్భంగా డైరెక్టర్ సాయిరామ్ చల్లా మాట్లాడుతూ....మా సొంతూరు గుంటూరు. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే మక్కువ ఎక్కువ. అయితే సాఫ్ట్ వేర్ జాబ్ లో సెటిల్ అయ్యాను. 21 ఏళ్లుగా సాఫ్ట్ జాబ్ లో ఉన్నాను. ఒక టాప్ సాఫ్ట్ వేర్ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ గా వర్క్ చేసాను. ఆర్య సినిమా అప్పటి నుంచి సుకుమార్ గారితో పరిచయం ఉంది. ఆయన స్పూర్తితోనే సినిమా దర్శకుడు అవ్వాలనుకున్నాను. సుకుమార్ ని కలిసి ఈ కథ చెప్పాను. కథ విని బాగుంది..ఎలాంటి మార్పులు చేయనవసరం లేదు అని చెప్పారు. ఆయన చెప్పిన మాటలతో ఈ సినిమాని ప్రారంభించాను.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే...ఇది ఒక సాఫ్ట్ వేర్ థ్రిల్లర్ మూవీ. ట్విన్ టవర్స్ కూలిపోయినప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అక్కడ నుంచి బయటపడతారు. అక్కడ ఒక టేప్ దొరుకుతుంది. ఆ టేప్ తీసుకుని ఇండియా వచ్చేసి ఇక్కడ సాఫ్ట్ వేర్ జాబ్ లో జాయిన్ అవుతారు. అయితే ఇక్కడ ఈ సాఫ్ట్ వేర్ కంపెనీలో పగలు బాగానే ఉంటుంది. రాత్రి మాత్రం మిస్టరీస్ జరుగుతుంటాయి. ఆ టేప్ కి, రాత్రి జరిగే మిస్టరీస్ కి సంబంధం ఏమిటి..? అనేది తెరపై చూడాల్సిందే. హీరో అశోక్ డైరెక్షన్ డిపార్టెమెంట్ లో వర్క్ చేసాడు. అలాగే హీరోయిన్ దిశా తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో కూడా నటించింది. దీంతో నేను డైరెక్షన్ కి కొత్త అయినా ఎక్స్ పీరియన్స్ ఉన్న హీరో, హీరోయిన్ కావడంతో అవుట్ పుట్ బాగా వచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందించిన కంట్రోల్ సి ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అనే నమ్మకం ఉంది అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments