అర్జున్- జెడి చక్రవర్తిల 'కాంట్రాక్ట్'
Friday, February 3, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ కథానాయకులు అర్జున్, జెడి చక్రవర్తి హీరోలుగా కృతి కట్వా, దివ్యాసింగ్ హీరోయిన్లుగా సమీర్ ప్రొడక్షన్స్ పతాకం పై సమీర్ దర్శకనిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం 'కాంట్రాక్ట్ '. ఈ చిత్రం టైటిల్, లోగో, టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. టైటిల్ ను హీరో అర్జున్, లయన్ సాయివెంకట్ ఆవిష్కరించగా లోగోను స్వామిగౌడ్, మోషన్ పోస్టర్ ను స్వామిగౌడ్, ప్రతాని రామకృష్ణగౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ.. 'తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం సినిమా పరిశ్రమను ఎంతగానో ప్రోత్సహిస్తుంది. చిన్న సినిమాలకు ధియేటర్స్ దొరక్కపోవడం చాల బాధాకరం. ముఖ్యంగా ఈ సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరించే దిశగా ఆ శాఖ మంత్రి ఐన తలసాని శ్రీనివాస యాదవ్ గారికి అప్పగించడం జరిగింది. ఆ దిశగా ప్రభుత్వం పరిష్కార మార్గాలు అన్వేషిస్తుంది. అదే విధంగా గ్రామా స్థాయి నుండి కూడా ప్రతి సినిమాను ప్రోత్సహించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం' అన్నారు. మంత్రి మహేందర్ రెడ్డి మాట్లడుతూ.. 'రెండు తెలుగు రాష్ట్రాల్లో హీరో అర్జున్ కు అభిమానులు ఉన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమను దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. అర్జున్ కి ఈ సినిమా వంద రోజులు ఆడి ఇంకా ఎక్కువ పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను' అన్నారు.
ఆర్.కె.గౌడ్ మాట్లాడుతూ.. 'అర్జున్ గారి 'జోడి నెంబర్. ' నుండి ఆయనతో నాకు సుదీర్ఘమైన అనుబంధం ఉంది. ఇద్దరం మంచి మిత్రులం. ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో ఇంతమంది అభిమానులు ఉండడం అభినందనీయం. ఈ సినిమా అన్ని వర్గాల వారిని అలరించి, మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను' అన్నారు.
హీరో అర్జున్ మాట్లాడుతూ.. 'మొదట నేను పోలీస్ ఆఫీసర్ అవుదామని కరాటే నేర్చుకున్నాను. కానీ అనుకోకుండా కోడి రామకృష్ణ గారి 'మా పల్లెలో గోపాలుడు' చిత్రంతో హీరోగా ఇంతమంది అభిమానులను సంపాదించుకున్నాను. అందుకు కారణమైన కోడి రామకృష్ణగారికి, తెలుగు అభిమానులకు నా కృతఙ్ఞతలు. ఈ సినిమా కూడా తప్పకుండా తెలుగు వారిని అలరించేలా ఉంటుంది' అన్నారు.
దర్శకనిర్మాత సమీర్ మాట్లడుతూ.. 'జెడి చక్రవర్తి గారి దగ్గర వర్క్ చేయడం ఆనందంగా ఉంది. ఆయనిచ్చిన ప్రోత్సాహమే ఈ రోజున ఈ సినిమా తీయడానికి కారణమైంది. టీం అందరి సహకారంతో ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దగలిగాను. ఈ సినిమా తర్వాత మరో భారీ బడ్జెట్ చిత్రాన్ని తీయబోతున్నాను' అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్యెల్యే ప్రకాష్ గౌడ్, చేవెళ్ల ఎమ్యెల్యే యాదయ్య, దర్శకుడు వి.సాగర్, సహ నిర్మాతలు మన్వర్ అలీ, టి.శశిధర్ రావు, సోషిని ఆయినాల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ వి.సునీల్ కుమార్, ఎం.రమేష్ తదితరులు పాల్గొన్నారు. అర్జున్,జెడి చక్రవర్తి, కృతి కట్వా, దివ్యాసింగ్ హీరో హీరోయిన్లుగా అలీ, ఎంఎస్.నారాయణ, ఘజల్ ఖాన్, అశోక్ కుమార్, ఢిల్లీ రాజేశ్వరి, జయ ప్రకాష్ రెడ్డి, ఎంఏ.ఖయ్యుమ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం; సుభాష్ ఆనంద్, కెమెరా; జానీ లాల్, సమర్పణ; సంజయ్ గద్వక్,,సహ నిర్మాతలు: మన్వర్ అలీ, టి.శశిధర్ రావు, సోషిని ఆయినాల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వి.సునీల్ కుమార్, ఎం.రమేష్ నిర్మాత, దర్శకత్వం; సమీర్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments