సూపర్‌స్టార్ కృష్ణకు గుండెపోటు.. విషమంగానే ఆరోగ్యం, 24 గంటలు గడిస్తేనే : కాంటినెంటల్ వైద్యులు
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్ధితిపై కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు మీడియా ముందుకు వచ్చారు. ఉదయం నుంచి మీడియాలో వస్తున్న కథనాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు డాక్టర్లు. గుండెపోటుతో స్పృహలో లేని పరిస్ధితుల్లో కృష్ణను తీసుకొచ్చారని డాక్టర్ గురు ఎన్ రెడ్డి తెలిపారు. వెంటనే సీపీఆర్ చేసి గుండెపోటు నుంచి బయటపడేలా చేశామని... ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని రెడ్డి వెల్లడించారు. కృష్ణ పరిస్ధితి విషమంగానే వుందని చెప్పాలని గురు ఎన్ రెడ్డి పేర్కొన్నారు. గంట గంటకు ఏమవుతుందో చెప్పలేమని.. శరీరం సహకరించేదాన్ని బట్టి వైద్యం అందిస్తామని డాక్టర్లు తెలిపారు. 24 గంటల తర్వాత మళ్లీ వివరాలు వెల్లడిస్తామని వైద్యులు చెప్పారు. ఆయన కోలుకోవాలని అందరం ప్రార్థిద్దామన్నారు.
ఆసుపత్రికి ఒక్కొక్కరిగా కుటుంబ సభ్యులు :
రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం వెళ్తే.. పరిస్ధితి ఇలా ఎందుకు వుంటుందని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. తమ అభిమాన నటుడి ఆరోగ్య పరిస్ధితిపై అసలు విషయం చెప్పాలంటూ పలువురు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు.. నిపుణులైన వైద్య బృందం కృష్ణ ఆరోగ్య పరిస్ధితిని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కృష్ణ కూతుళ్లు, అల్లుళ్ళు ఆల్రెడీ కాంటినెంటల్ ఆసుపత్రిలోనే ఉన్నారని తెలుస్తోంది. వైద్యులు వచ్చి చెబితేనే కానీ ఈ గందరగోళానికి చెక్ పడేలా కనిపించడం లేదు.
నరేశ్ ఇంట్లోనే కృష్ణ :
కాగా... ఈ ఏడాది జనవరిలో కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్ బాబు అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీని నుంచి ఆ కుటుంబం ఇంకా కోలుకోకముందే ఆయన సతీమణి ఇందిరా దేవి కన్నుమూశారు. అయితే కృష్ణ స్టార్‌గా ఎదుగుతున్న సమయంలో తన సహ నటి విజయ నిర్మలను ద్వితీయ వివాహం చేసుకున్నారు. అయితే ఆమె కూడా 2019లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. విజయ నిర్మల, రమేశ్ బాబు, ఇందిరా దేవిల వరుస మరణాలతో సూపర్‌స్టార్ కృష్ణకు కోలుకోలేని దెబ్బ తగిలినట్లయ్యింది. ఐదేళ్ల క్రితం శ్రీశ్రీ చిత్రంలో నటించిన తర్వాత కృష్ణ సినిమాలకు దూరంగా వుంటూనే వస్తున్నారు. కృష్ణ ప్రస్తుతం నరేశ్ ఇంట్లోనే వుంటున్నారు. మహేశ్ కూడా తరచు తండ్రి వద్దకు వెళ్లి, ఆయనతోనే ఎక్కువ సేపు గడుపుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com