BiggBoss: చెత్త రూల్స్.. బిగ్‌బాస్‌పై కంటెస్టెంట్స్ తిరుగుబాటు, రోహిత్‌ది పెద్ద మనసు

  • IndiaGlitz, [Thursday,December 01 2022]

బిగ్‌బాస్ 6 తెలుగు ఎపిసోడ్‌ ముగింపు దశకు చేరుకుంది. నేరుగా ఫైనల్స్‌లో అడుగుపెట్టేందుకు టికెట్ టు ఫినాలే టాస్క్ మొదలెట్టారు బిగ్‌బాస్. నిన్నటి నుంచి మొదలైన ఈ గేమ్‌లో శ్రీసత్య, కీర్తి, ఇనయా ఔట్ అయిన సంగతి తెలిసిందే. ఇక్కడి దాకా వచ్చి ఫైనల్‌కి వెళ్లకపోతే ఎలా అన్నట్లు ఇంటి సభ్యులంతా గెలిచేందుకు కష్టపడుతున్నారు. టాస్క్‌లో భాగంగా స్నోమెన్ ముక్కలతో బొమ్మను రూపొందించాలి. అంతేకాకుండా.. చివరి వరకు బొమ్మను ఇతరుల నుంచి కాపాడుకోవాలి. నిన్నటి ఎపిసోడ్‌లో ఇనయా- శ్రీహాన్ రొమాన్స్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. డిఫెండ్ చేసుకోవాల్సింది పోయి ఇద్దరూ వాటేసుకోవడం ఏంటంటూ ఇంటి సభ్యులు వారిపై పంచ్‌లు కురిపించారు.

ఎలిమినేట్ అయిన శ్రీసత్య, కీర్తి, ఇనయాలకు బిగ్‌బాస్ మరో అవకాశం కల్పించారు. ఇందుకోసం వీరు ముగ్గురికి స్పెషల్‌గా ఒక గేమ్ పెట్టాడు. దీనిలో గెలిచిన వారు టికెట్ టు ఫినాలే టాస్క్‌లో పోటీ పడొచ్చు. ఇక గేమ్‌లో భాగంగా శ్రీసత్య, కీర్తి, ఇనయాలకు వైట్ కలర్ టీ షర్ట్స్ ఇచ్చారు. వాటిని ధరించి సర్కిల్‌లో నిల్చొని పక్కనే వున్న ఎరుపు రంగు పెయింట్‌ని ఇతరుల వీపుపై రాయాలి. అయితే ఎరుపు రంగు రాయకుండా మిగిలిన వారు డిఫెండ్ చేసుకోవాలి. ఎవరికైతే వీపుపై రెడ్ కలర్ పెయింట్ ఎక్కువగా వుంటుందో వారు ఎలిమినేట్ అవుతారు.

గేమ్ ప్రారంభమవ్వగానే ఇనయా, కీర్తిలు శ్రీసత్యపై అటాక్ చేశారు. దీంతో మరోసారి శ్రీసత్య ఎలిమినేట్ అయింది. తర్వాతి రౌండ్‌లో మాత్రం ఇనయా, కీర్తిలు గెలిచేందుకు తీవ్రంగా పోరాడారు. వేలికి గాయమైనా కీర్తి ఇనయాపై పోరాడింది. ఇద్దరు టీ షర్ట్స్‌కి రంగు సమానంగా వుండటంతో సంచాలక్‌గా వున్న రేవంత్‌కి ఎవరు విన్నరో తేల్చడం కష్టమైంది. చివరికి కీర్తినే విజేతగా ప్రకటించాడు. ఇనయా, శ్రీసత్యలు టికెట్ టు ఫినాలే టాస్క్ నుంచి ఎలిమినేట్ కావడంతో ఆదిరెడ్డి, రేవంత్, రోహిత్, కీర్తి, ఫైమా, శ్రీహాన్‌లు పోటీపడ్డారు.

ఇందుకోసం బిగ్‌బాస్ ఓ గేమ్ పెట్టాడు. మిలటరీ ట్రైనింగ్ రేంజ్‌లో పాకుతూ, దూకుతూ, ఎక్కుతూ బాస్కెట్‌లో బాల్ వేయాల్సి వుంటుంది. అయినప్పటికీ అంతా తీవ్రంగా పోరాడారు.. అలా రేవంత్‌ తొలిస్థానంలో నిలవగా.. ఆదిరెడ్డి, శ్రీహాన్, ఫైమా, కీర్తి, రోహిత్‌లు తర్వాతి స్థానాల్లో నిలిచారు. అయితే ఈ ఆరుగురిలో నలుగురు మాత్రమే నెక్ట్స్‌ లెవల్‌కి వెళ్తారని.. ఆ నలుగురు ఎవరో మీలో మీరే తేల్చుకోవాలని బిగ్‌బాస్ కండీషన్ పెట్టాడు. దీంతో కంటెస్టంట్ ఫైర్ అయ్యారు. ఇలాంటి చెత్త రూల్స్ పెట్టేటప్పుడు ఇంత కష్టపడి ఆడటం దేనికంటూ మండిపడ్డారు. ఏకాభిప్రాయంలో తమను తీసేస్తే అప్పటిదాకా పడ్డ కష్టమంతా వేస్ట్ అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

చివరికి నెక్ట్స్ లెవల్‌లో ఎవరు వుండాలో, ఎవరు వుండకూదా నిర్ణయించే అధికారాన్ని శ్రీసత్య, ఇనయాలకు అప్పగించాడు బిగ్‌బాస్. దీనిలో భాగంగా 5, 6 స్థానాల్లో వున్న రోహిత్, కీర్తిలను వీరిద్దరూ తప్పించారు. ఈ నిర్ణయంపై కీర్తి అసహనం వ్యక్తం చేసింది. ఇనయా, రేవంత్‌లకు గట్టిగా క్లాస్ పీకింది. రేవంత్ సోది అని కామెంట్ చేయడంతో.. ఆ మాట చెప్పడానికి మీరెవ్వరూ అంటూ ఇచ్చిపడేసింది కీర్తి. అయితే రోహిత్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. మీరిద్దరూ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నా, తనను కాదని ఎక్కువ పాయింట్లు వచ్చిన వారిని తప్పిస్తే వాళ్లకి అన్యాయం చేసినట్లు అవుతుందని .. తక్కువ పాయింట్లు వున్నవాళ్లని తప్పించడమే మంచిదని ఇనయా, శ్రీసత్యల నిర్ణయాన్ని సమర్ధించి టికెట్ టు ఫినాలే రేస్ నుంచి తప్పుకున్నాడు.

ఇకపోతే.. టికెట్ టు ఫినాలే టాస్క్‌లో గెలిచి ఆదిరెడ్డి ఫైనల్‌లో అడుగుపెట్టిన తొలి కంటెస్టెంట్‌గా నిలిచినట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేస్తే చాలు. ప్రస్తుతం నామినేషన్స్‌లో వున్న వారిలో ఫైమా, శ్రీసత్యలు డేంజర్ జోన్‌లో వున్నారు. వీరిద్దరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవుతారంటూ ప్రచారం జరుగుతోంది.