Download App

24న ‘ప్రేమ ఇష్క్ కాదల్’ ఆడియో..

Published by rajeshe092eb6a68


పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్న చిత్రం’ ప్రేమ ఇష్క్ కాదల్’. షిర్డి సాయి కంబైన్స్, లక్కీ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డి సురేష్ బాబు సమర్పణ. బెక్కెం వేణుగోవాల్ నిర్మాత. హర్షవర్ధన్, రాణే, విష్ణు, హరీష్, వితిక, రీతూ వర్మ, శ్రీముఖి హీరోహీరోయిన్లు. ఈ నెల 24న ఈ చిత్ర ఆడియో విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ సందర్భంగా నిర్మాత  బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ శ్రవణ్ మంచి సంగీతాన్ని అందించాడు. పాటలు అద్భుతంగా వచ్చాయి.


ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ నెల 24న ఆడియో విడుదల చేయాలని అనుకుంటున్నాం అని తెలిపారు. దర్శకుడు పవన్ సాధినేని మాట్లాడుతూ స్టైలిష్ గా తెరకెక్కించాం. ఇందులో మూడు జంటలు ప్రేమాయణాన్ని సరికొత్తగా ఆవిష్కరించాం అని అన్నారు.


కెవెరాః ఘట్టమనేని, పాటలుః కృష్ణ చైతన్య, సంగీతం: శ్రవణ్, నిర్మాతః బెక్కెం వేణు గోపాల్, దర్శకుడుః పవన్ సాధినేని.