తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర.. రూ.12 కోట్లు సుపారీ
- IndiaGlitz, [Thursday,March 03 2022]
తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత వీ. శ్రీనివాస్ గౌడ్ హత్యకు పన్నిన కుట్రను సైబరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. మంత్రితో పాటు ఆయన అనుచరుల హత్యకు సుపారీ గ్యాంగ్‌తో డీల్ కుదుర్చుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీని వెనుక సూత్రధారులు మహబూబ్‌నగర్‌కు చెందిన వారిగా తెలుస్తోంది.
రూ.12 కోట్లతో మంత్రిని చంపించేందుకు ఫరూక్ అనే వ్యక్తిని సంప్రదించగా.. అతడు పేట్‌బషీర్‌బాద్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. హత్యకు కుట్రలో భాగస్వాములైన మహబూబ్‌నగర్‌కు చెందిన నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్‌లపై గతంలోనూ పలు హత్య కేసులు ఉన్నాయి. ఈ ముగ్గురినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నాగరాజు ఇచ్చిన సమాచారంతో మరో నిందితుడు రఘును ఢిల్లీలో బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి నివాసంలో అరెస్టు చేశారు. అలాగే రఘుకు ఆశ్రయమిచ్చిన మరో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించి విడుదల చేశారు.
అయితే 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్‌తో ఈ హత్య కేసుకు లింకులు వున్నట్లుగా తెలుస్తోంది. శ్రీనివాస్ గౌడ్ సమర్పించిన అఫిడవిట్‌లో అక్రమాలు వున్నాయని కొందరు ఫిర్యాదు చేశారు.