Exit Polls: తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం.. ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడి..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం దక్కించుకుంటుందని మెజార్టీ సర్వేలు తేల్చాయి. ఆరా సంస్థ సర్వేలో కాంగ్రెస్ 58-67 స్థానాలు.. బీఆర్ఎస్ 41-49 స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయని తెలిపింది. బీజేపీ 5-7, ఎంఐఎం 6-7 సీట్లు పొందుతాయని వెల్లడించింది. చాణక్య స్ట్రాటజీస్ సర్వేలో బీఆర్ఎస్ 22-30.. కాంగ్రెస్ 67-68, బీజేపీ 6-9, ఎంఐఎం 6-7 స్థానాల్లో గెలుపొందుతాయని తేలింది. న్యూస్ 18 ఎగ్జిట్ పోల్‌లో కాంగ్రెస్ 56 సీట్లు గెలుస్తుందని.. అధికార BRSకు 48 సీట్లు మాత్రమే రావచ్చని పేర్కొంది. బీజేపీకి పది సీట్లు రావచ్చని వెల్లడించింది. ఎంఐఎం 5 గెలిచే అవకాశం ఉందని పేర్కొంది.
మిగిలిన సంస్థల ఎగ్జిట్ పోల్స్..
పీపుల్స్ పల్స్ సర్వే..
కాంగ్రెస్: 62-72
బీఆర్ఎస్: 35-46
బీజేపీ: 3-8
ఎంఐఎం: 6-7
రాజనీతి స్ట్రాటజీస్ సర్వే..
కాంగ్రెస్: 56-61
బీఆర్ఎస్: 45-50
బీజేపీ: 5-10
ఎంఐఎం: 6-7
థర్డ్ విజన్ సర్వే..
బీఆర్ఎస్ 61-68
కాంగ్రెస్ 34-10
బీజేపీ 03-05
ఇతరులు 05-08
పల్స్ టుడే సర్వే..
బీఆర్ఎస్ : 69-71
కాంగ్రెస్ : 37-38
బీజేపీ : 03-05
ఎంఐఎం : 06
ఇతరులు : 01
పొలిటికల్ గ్రాఫ్ సర్వే..
బీఆర్ఎస్ – 68
కాంగ్రెస్ – 38
బీజేపీ – 05
ఇతరులు – 08
ఆత్మ సాక్షి సర్వే..
బీఆర్ఎస్ – 58-63
కాంగ్రెస్ – 48-51
బీజేపీ – 07-08
ఇతరులు – 07-09
మొత్తానికి మెజార్టీ ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని స్పష్టంగా తెలుస్తుంది. మరి ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎంతవరకు నిజం అవుతాయో తెలియాలంటే డిసెంబర్ 3వరకు వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments