Exit Polls: తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం.. ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడి..

  • IndiaGlitz, [Thursday,November 30 2023]

తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారం దక్కించుకుంటుందని మెజార్టీ సర్వేలు తేల్చాయి. ఆరా సంస్థ సర్వేలో కాంగ్రెస్ 58-67 స్థానాలు.. బీఆర్ఎస్ 41-49 స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయని తెలిపింది. బీజేపీ 5-7, ఎంఐఎం 6-7 సీట్లు పొందుతాయని వెల్లడించింది. చాణక్య స్ట్రాటజీస్ సర్వేలో బీఆర్ఎస్ 22-30.. కాంగ్రెస్ 67-68, బీజేపీ 6-9, ఎంఐఎం 6-7 స్థానాల్లో గెలుపొందుతాయని తేలింది. న్యూస్ 18 ఎగ్జిట్ పోల్‌లో కాంగ్రెస్‌ 56 సీట్లు గెలుస్తుందని.. అధికార BRSకు 48 సీట్లు మాత్రమే రావచ్చని పేర్కొంది. బీజేపీకి పది సీట్లు రావచ్చని వెల్లడించింది. ఎంఐఎం 5 గెలిచే అవకాశం ఉందని పేర్కొంది.

మిగిలిన సంస్థల ఎగ్జిట్ పోల్స్..

పీపుల్స్ పల్స్ సర్వే..

కాంగ్రెస్: 62-72
బీఆర్ఎస్: 35-46
బీజేపీ: 3-8
ఎంఐఎం: 6-7

రాజనీతి స్ట్రాటజీస్ సర్వే..

కాంగ్రెస్: 56-61
బీఆర్ఎస్: 45-50
బీజేపీ: 5-10
ఎంఐఎం: 6-7

థర్డ్ విజన్ సర్వే..

బీఆర్ఎస్ 61-68
కాంగ్రెస్ 34-10
బీజేపీ 03-05
ఇతరులు 05-08

పల్స్ టుడే సర్వే..

బీఆర్ఎస్ : 69-71
కాంగ్రెస్ : 37-38
బీజేపీ : 03-05
ఎంఐఎం : 06
ఇతరులు : 01

పొలిటికల్ గ్రాఫ్ సర్వే..

బీఆర్ఎస్ – 68
కాంగ్రెస్ – 38
బీజేపీ – 05
ఇతరులు – 08

ఆత్మ సాక్షి సర్వే..

బీఆర్ఎస్ – 58-63
కాంగ్రెస్ – 48-51
బీజేపీ – 07-08
ఇతరులు – 07-09

మొత్తానికి మెజార్టీ ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని స్పష్టంగా తెలుస్తుంది. మరి ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎంతవరకు నిజం అవుతాయో తెలియాలంటే డిసెంబర్ 3వరకు వేచి చూడాల్సిందే.

More News

Telangana Elections: తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు మాత్రం అధికారులు అనుమతి ఇస్తున్నారు.

మావోయిస్టు ప్రాంతాలైన 13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్

తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు మరో గంట మాత్రమే మిగిలి ఉంది. అయితే 13 నియోజకవర్గాల్లో మాత్రం గంట ముందుగానే పోలింగ్ ముగిసింది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన మంచిర్యాల,

KCR: చింతమడకలో ఓటు వేసిన సీఎం కేసీఆర్ దంపతులు

తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు సిద్ధిపేట జిల్లా చింతమడకలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఓటర్లకు అభివాదం చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

OWK 2nd Tunnel: అవుకు రెండో టన్నెల్ ప్రారంభించిన సీఎం జగన్.. జాతికి అంకితం..

రాయలసీమ ప్రజల చిరకాల వాంఛన నెరవేర్చే దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్‌ను ఆయన ప్రారంభించి జాతికి అంకితం చేశారు.

Revanth Reddy: కుట్రతోనే నాగార్జునసాగర్ ఘటన.. కేసీఆర్ పన్నాగాలు ఫలించవు: రేవంత్

నాగార్జునసాగర్ వద్ద ఏర్పడిన ఉద్రిక్తత ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. కొడంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన