రేవంత్‌కు ఊహించని షాకిచ్చిన కాంగ్రెస్!!
Send us your feedback to audioarticles@vaarta.com
భారతదేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఊహించని షాకిచ్చిందా..? ఇక పార్టీలో రేవంత్ పప్పులు ఉడకవా..? అధిష్టానాన్ని ఒప్పించి ఒక్క ఎమ్మెల్యే సీటును ఫైర్‌బ్రాండ్ ఇప్పించుకోలేకపోయారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే రేవంత్ ప్లాన్ మొత్తం అట్టర్ ప్లాప్ అయ్యిందని తెలుస్తోంది.
మొత్తం బెడిసి కొట్టింది.. సీన్ రివర్స్!
హుజూర్ నగర్ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికోసం వేట సాగించే పనిలో నిమగ్నమవ్వగా.. రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి.. తాను చెప్పిన అభ్యర్థికి మాత్రమే టికెట్ ఇవ్వాలని అధిష్టాన్ని గట్టిగా డిమాండ్ చేసిన విషయం విదితమే. అంతేకాదు.. ప్రస్తుత పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డిని అధిష్టానం దగ్గర అడ్డంగా బుక్ చేయాలని భావించారు. అయితే ఆ ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యింది. అధిష్టానం రేవంత్ మాట అస్సలు లెక్కచేయకుండా.. ఉత్తమ్‌కు జై కొట్టింది. వాస్తవానికి రేవంత్ రెడ్డి శ్యామలా కిరణ్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. అయితే ఉత్తమ్ మాత్రం.. ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలన్నా.. కాంగ్రెస్ పుంజుకోవాలన్నా పద్మావతి టికెట్ ఇవ్వాలని.. టికెట్ కన్ఫామ్ చేస్తే తాను గెలిపించుకుని వస్తానని అధిష్టానానికి ఆయన మాటిచ్చారట.
టికెట్ ఇవ్వడం వెనుక!
కిరణ్ రెడ్డి అనే వ్యక్తి జనాలకు పెద్దగా తెలియదు.. జనాలు ఆయన్ను చూడలేదు కూడా. అయితే పద్మావతి మాత్రం ఇక్కడ అందరికీ సుపరిచితురాలే.. పైగా ఉత్తమ్ వరుసగా గెలిచిన నియోజకవర్గం ఇది. పద్మావతి అయితే పక్కాగా గెలుస్తుందని భావించిన కాంగ్రెస్ పెద్దలు టికెట్ ఫిక్స్ చేశారు. పద్మావతి గత ఎన్నికల్లో కోదాడ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. హుజుర్‌నగర్ నుంచి పోటీ చేయిస్తే కాంగ్రెస్‌దే గెలుపని భావించి ఆమెకు టికెట్ ఇచ్చేసింది. దీంతో రేవంత్‌రెడ్డి అండ్ కో కు కోలుకోలేని.. ఊహించని షాక్ తగిలినట్లైంది.
ఇందుకే ఉప ఎన్నిక!
ఇదిలా ఉంటే.. 2018 డిసెంబర్‌లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి.. హుజూర్ నగర్ నుంచి పోటీ చేసి గెలుపొందడం.. ఆ తర్వాత మళ్లీ నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి లోక్‌సభకు ఎంపికయ్యారు. అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో హుజూర్ నగర్ ఉప ఎన్నిక జరుగుతోంది.
వాట్ నెక్స్ట్ రేవంత్!?
ఇదిలా ఉంటే.. ఈ ఉపఎన్నిక రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే ఎన్నికగా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక రాష్ట్ర చరిత్రలో నిలిచిపోనున్న ఎన్నికగా అభివర్ణిస్తున్నారు. 30 వేల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే గత ఎన్నికల్లో ఓడిన సైదిరెడ్డికే టీఆర్ఎస్ ఈసారి కూడా టికెట్ ఇచ్చారు. మరోవైపు బీజేపీ సైతం అభ్యర్థిని బరిలోకి దింపాలని భావిస్తోంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఎలా ముందుకెళ్తారో..? ఏం నిర్ణయం తీసుకుంటారో..? పార్టీపై తిరుగుబాటు చేస్తా వేచిచూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout