వీహెచ్‌ వ్యవహారంలో నగేశ్‌కు షాకిచ్చిన కాంగ్రెస్

  • IndiaGlitz, [Monday,May 13 2019]

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్)పై ఇటీవల అఖిలపక్షం ధర్నాలో పీసీసీ కార్యదర్శి నగేశ్ ముదిరాజ్ దురుసుగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. సీనియర్ నేత అని కూడా చూడకుండా వీహెచ్‌పై చేయిచేసుకోవడం.. ఎదురు మాట్లాడటాన్ని అధిష్టాన్ని సీరియస్‌గా తీసుకుంది. దీంతో నగేశ్‌పై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు అధిష్టానం స్పష్టం చేసింది. వివరాల్లోకెళితే.. సోమవారం గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీ సమావేశం జరిగింది. ఈ కమిటీ ఎదుట హాజరైన నగేశ్ ధర్నారోజు అసలేం జరిగింది..? తప్పెవరిది..? ఎందుకు చేయి చేసుకోవాల్సి వచ్చింది..? అని జరిగిన ఘటనపై వివరణ ఇచ్చుకున్నారు. నగేశ్ చెప్పిన విషయాలన్నీ లోతుగా పరిశీలించిన కమిటీ ఆయన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది.

నేను చేసింది తప్పే మరి వీహెచ్ సంగతేంటి..?

ఇదిలా ఉంటే.. తనపై సస్పెన్షన్ వేటు వేయడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన నగేశ్ గాంధీభవన్‌లోని గాంధీ విగ్రహం ఎదుట నిరసనకు దిగారు. తనను అకారణంగా సస్పెండ్ చేశారని.. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ఆయన చెబుతున్నారు.‘అవును.. నేను చేసింది తప్పే అని ఒప్పుకుంటున్నాను’ కానీ, ఈ ఘటనకు ముఖ్యకారకుడైన వీహెచ్‌ను ఎందుకు వదిలేస్తారు? అని ఈ సందర్భంగా క్రమశిక్షణా కమిటీని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు.. ఆరోజు జరిగిన సంఘటన దురదృష్టకరమని, క్షమాపణ కూడా కోరానని చెప్పారు. అసలు, ఆ సంఘటనకు ముఖ్యకారణం హనుమంతురావేనని నగేశ్ ఆరోపిస్తున్నారు. అయితే ఈ వ్యవహారం ఇంతటితో ఆగుతుందో..? మరింత ముదురుతుందో వేచి చూడాల్సిందే మరి.

More News

రొమాంటిక్ క్రిమినల్స్ అందరినీ మెప్పిస్తుంది : సునీల్ కుమార్ రెడ్

ఒక రొమాంటిక్ క్రైమ్ క‌థ, ఒక క్రిమిన‌ల్ ప్రేమ‌ క‌థ‌ లాంటి సందేశాత్మ‌క, క‌మ‌ర్షియ‌ల్ హిట్ చిత్రాలు అందించ‌డమే కాకుండా కంటెంట్ వున్న చిత్రాల‌కు పెద్ద బ‌డ్జెట్ అవ‌స‌రం లేద‌ని నిరూపించి టాలీవుడ్

బాలీవుడ్‌లో అంచనాలు పెంచేస్తున్న 'కబీర్ సింగ్'

విజయ్ దేవరకొండ, షాలిని పాండే నటీనటులుగా భద్రకాళి పిక్చర్స్ పతాకంపై సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’ ఏ రేంజ్‌లో హిట్టయ్యిందో కొత్తగా చెప్పనక్కర్లేదు.

'ఫలక్‌ నుమా దాస్‌' ట్రైలర్‌ చాలా బాగుంది, సినిమా బ్లాక్‌బ్లస్టర్‌ హిట్‌ కావాలి - వెంకటేష్‌

'వెళ్ళిపోమాకే', 'ఈ నగరానికి ఏమైంది' లాంటి చిత్రాలలో తనదైన నటనతో మంచి గుర్తిపు తెచ్చుకున్నారు నటుడు విశ్వక్‌ సేన్‌. ప్రస్తుతం విశ్వక్‌ సేన్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం 'ఫలక్‌ నుమా దాస్‌'.

మా స్కూల్స్‌తో మెగా ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదు!

టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి విద్యారంగంలోకి అడుగుపెట్టారని.. ఇంటర్నేషనల్ స్కూల్స్ స్థాపిస్తున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

చంద్రబాబు 4 సర్వేల్లో గెలుపెవరిదో తేలిపోయింది...

అవును.. మీరు వింటున్నది నిజమే టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఏపీ ఎన్నికల ఫలితాలపై నాలుగు సర్వేలు చేయించారు.