Congress Party:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ సర్వే .. బీఆర్ఎస్‌తో హస్తం నువ్వానేనా, బీజేపీ పరిస్ధితి ఏంటి ..?
Send us your feedback to audioarticles@vaarta.com
మరికొద్దినెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్.. తెలంగాణ ఇచ్చినప్పటికీ పదేళ్లు వరుసగా ప్రతిపక్షంలో వున్నామని కాంగ్రెస్.. దక్షిణాదిలో కర్ణాటక చేజారడంతో తెలంగాణను వదులుకునేది లేదని బీజేపీలు విజయం కోసం వ్యూహా ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటి నుంచే నేతలను జనంలో వుంచుతున్నాయి ఆయా పార్టీల అధినాయకత్వాలు. అయితే కర్ణాటక ఎన్నికల్లో విజయం ఇచ్చిన జోష్‌తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. గతంలో మనస్పర్థలు , గొడవలు వున్నప్పటికీ వాటన్నింటిని పక్కనబెట్టేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలు పాదయాత్ర చేస్తున్నారు. అలాగే నియోజకవర్గాల్లో నేతలు కూడా జనంలోనే వుంటున్నారు.
సీట్లు చెరి సమానం.. ఓటింగ్‌లో మాత్రం బీఆర్ఎస్‌దే హవా :
బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఇలా మూడు పార్టీలు బలంగా వున్న నేపథ్యంలో ఈసారి ఎవరు గెలుస్తారనే దానిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో నిర్వహించిన సర్వే వివరాలను రేవంత్ రెడ్డి వెల్లడించారు. దీనిలో అధికార బీఆర్ఎస్‌కు 45 , కాంగ్రెస్‌కు 45, బీజేపీకి 7, ఎంఐఎంకు 7 సీట్లు వచ్చే అవకాశం వుందని ఆయన చెప్పారు. 15 స్థానాల్లో మాత్రం గట్టి పోటీ వుంటుందని రేవంత్ వెల్లడించారు. ఓట్ల శాతంలో మాత్రం బీఆర్ఎస్ 37 శాతంతో ముందంజలో వుందని.. కాంగ్రెస్ 34 శాతం, బీజేపీకి 14 శాతం ఓటింగ్ లభిస్తుందని ఆయన తెలిపారు. గతంలో 24 శాతంగా వున్న బీజపీ ఓటింగ్ శాతం 14 శాతానికి పడిపోయిందని రేవంత్ చెప్పారు. అయితే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఓటింగ్ శాతంలో మార్పులు చోటు చేసుకుంటాయని ఆయన తెలిపారు.
కాంగ్రెస్‌లోకి చేరికల పర్వం :
మరోవైపు.. ఈసారి కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు వుండే అవకాశం వుందని కథనాలు వస్తున్నాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు త్వరలోనే కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారు. అలాగే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురనాథ రెడ్డి ఈ నెల 21న కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఇదే సమయంలో బీజేపీ, బీఆర్ఎస్‌లలో వున్న కొందరు అసంతృప్త నేతలు కూడా హస్తం గూటికి చేరుతారనే ప్రచారం జరుగుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout