Congress Party:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై  కాంగ్రెస్ సర్వే .. బీఆర్ఎస్‌తో హస్తం నువ్వానేనా, బీజేపీ పరిస్ధితి ఏంటి ..?

  • IndiaGlitz, [Sunday,June 18 2023]

మరికొద్దినెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్.. తెలంగాణ ఇచ్చినప్పటికీ పదేళ్లు వరుసగా ప్రతిపక్షంలో వున్నామని కాంగ్రెస్.. దక్షిణాదిలో కర్ణాటక చేజారడంతో తెలంగాణను వదులుకునేది లేదని బీజేపీలు విజయం కోసం వ్యూహా ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటి నుంచే నేతలను జనంలో వుంచుతున్నాయి ఆయా పార్టీల అధినాయకత్వాలు. అయితే కర్ణాటక ఎన్నికల్లో విజయం ఇచ్చిన జోష్‌తో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. గతంలో మనస్పర్థలు , గొడవలు వున్నప్పటికీ వాటన్నింటిని పక్కనబెట్టేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క‌లు పాదయాత్ర చేస్తున్నారు. అలాగే నియోజకవర్గాల్లో నేతలు కూడా జనంలోనే వుంటున్నారు.

సీట్లు చెరి సమానం.. ఓటింగ్‌లో మాత్రం బీఆర్ఎస్‌దే హవా :

బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఇలా మూడు పార్టీలు బలంగా వున్న నేపథ్యంలో ఈసారి ఎవరు గెలుస్తారనే దానిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో నిర్వహించిన సర్వే వివరాలను రేవంత్ రెడ్డి వెల్లడించారు. దీనిలో అధికార బీఆర్ఎస్‌కు 45 , కాంగ్రెస్‌కు 45, బీజేపీకి 7, ఎంఐఎంకు 7 సీట్లు వచ్చే అవకాశం వుందని ఆయన చెప్పారు. 15 స్థానాల్లో మాత్రం గట్టి పోటీ వుంటుందని రేవంత్ వెల్లడించారు. ఓట్ల శాతంలో మాత్రం బీఆర్ఎస్ 37 శాతంతో ముందంజలో వుందని.. కాంగ్రెస్ 34 శాతం, బీజేపీకి 14 శాతం ఓటింగ్ లభిస్తుందని ఆయన తెలిపారు. గతంలో 24 శాతంగా వున్న బీజపీ ఓటింగ్ శాతం 14 శాతానికి పడిపోయిందని రేవంత్ చెప్పారు. అయితే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఓటింగ్ శాతంలో మార్పులు చోటు చేసుకుంటాయని ఆయన తెలిపారు.

కాంగ్రెస్‌లోకి చేరికల పర్వం :

మరోవైపు.. ఈసారి కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు వుండే అవకాశం వుందని కథనాలు వస్తున్నాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు త్వరలోనే కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారు. అలాగే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురనాథ రెడ్డి ఈ నెల 21న కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఇదే సమయంలో బీజేపీ, బీఆర్ఎస్‌లలో వున్న కొందరు అసంతృప్త నేతలు కూడా హస్తం గూటికి చేరుతారనే ప్రచారం జరుగుతోంది.

More News

YS Jagan:దటీజ్ జగన్ .. బాపట్ల బాలుడి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం , గంటల్లోనే ఇంటికొచ్చిన చెక్

బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఉప్పలవారిపాలెంలో పదో తరగతి చదువుతున్న బాలుడు అమర్‌నాథ్‌ను పెట్రోల్ పోసి కాల్చి చంపిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో

Upasana:డెలివ‌రి కాక‌ముందే ఉపాస‌నకి .. ఊయ‌ల గిప్ట్ , దానికో స్పెషాలిటీ .. ఎవరు పంపారంటే..?

దాదాపు 11 ఏళ్ల తర్వాత గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్-ఉపాసన దంపతులు అభిమానులకు, కుటుంబ సభ్యులకు శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే.

Janasena Chief Pawan Kalyan:నా రెండు చెప్పులూ కొట్టేశారు .. వైసీపీ నేతలు ఇలా తయారేంట్రా :  పేర్ని నానికి పవన్ కళ్యాణ్ సెటైర్లు

ఇటీవల తనకు రెండు చెప్పులూ చూపిస్తూ హేళనగా మాట్లాడిన వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్

Pawan Tirumala Issues:దర్శనం పేరుతో దోపిడీ , ఏడుకొండలవాడితో ఆటలా .. నామరూపాల్లేకుండా పోతారు : జగన్‌కి పవన్ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి సాగు, అక్రమ రవాణాపై కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

Pawan Kalyan:ముఖ్యమంత్రిగా ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. వైసీపీ గుండాలకు నరకం చూపిస్తా : పవన్ కల్యాణ్

తనకు ముఖ్యమంత్రిగా ఒకసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.