చిరంజీవి గురించి అలా ప్రచారం చేయడం దారుణం: కాంగ్రెస్ పార్టీ
Send us your feedback to audioarticles@vaarta.com
2008లో మెగాస్టార్ చిరంజీవి తిరుపతి వేదికగా ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. 2009 ఎన్నికల్లో ఓటమి, అనంతరం జరిగిన పరిణామాలతో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. రాజ్యసభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు.
తిరిగి ఖైదీ నెం 150 చిత్రంతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం చిరంజీవి సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరు ఎలాంటి రాజకీయ కార్యకమాల్లో పాల్గొనడం లేదు. కాంగ్రెస్ పార్టీకి కూడా దూరంగా ఉంటున్నారు. అయితే అయన కాంగ్రెస్ లో కొనసాగుతున్నారా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు.
ఇదీ చదవండి: పెళ్లి కాకుండానే గర్భం.. ప్రకటించిన హీరోయిన్!
కానీ చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారని, ఆయన కాంగ్రెస్ వాది కాదు అంటూ కొన్ని మీడియాల్లో ప్రచారం జరిగింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంచార్జులు స్పందించారు. ఈ మేరకు మీడియా ప్రకటన విడుదల చేశారు.
చిరంజీవి గారు కాంగ్రెస్ వాదే అని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ఉమెన్ చాందీ కూడా స్పందించారు. చిరంజీవి తనకు ఇష్టమైన సినిమా రంగంలో బిజీగా ఉండడం వల్ల పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అంతమాత్రన ఆయన కాంగ్రెస్ వాది కాదు అని వార్తలు రాయడం దారుణం.
పార్టీ కార్యక్రమాలకు హాజరు కాలేనప్పటికీ చిరంజీవి కరోనా సమయంలో సేవా కారక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. భవిష్యత్తులో చిరంజీవి సేవలు పార్టీకి అందుతాయి. ఆయన క్రియాశీలకంగా పార్టీలో పాల్గొనే అవకాశం ఉంది అని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నాయకుల ప్రకటన ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఇటీవల చిరంజీవి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కార్యక్రమాలని ప్రశంసిస్తున్న సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments