Congress:ప్రజాకర్షణగా కాంగ్రెస్ మేనిఫెస్టో.. పేదలపై వరాల జల్లు..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ఈసారి ఎలాగైనా అధికారంలోకి కాంగ్రెస్ గట్టి పట్టుదలతో ఉంది. అందుకు తగ్గట్లే ప్రచారంలో దూసుకుపోతుంది. అధికార బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజలను చైతన్యపరుస్తుంది. ఎన్నికలకు చాలా రోజుల ముందే ఆరు గ్యారంటీలను ప్రకటించిన హస్తం పార్టీ వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. అలాగే వివిధ వర్గాలకు డిక్లర్లేషన్లు కూడా ప్రకటించింది. తాజాగా పూర్తి స్థాయి ఎన్నికల మేనిఫెస్టోను వెల్లడించనుంది. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేయనున్నారు. ఈ మేనిఫెస్టోలో పేదలకు లబ్ధి చేకూరే విధంగా అనేక పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు..
ఇందిరమ్మ బహుమతి పథకం కింద పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు రూ.1 లక్ష, 10 గ్రాముల బంగారం.
విద్యార్థులందరికీ ఉచిత ఇంటర్నెట్.
18 ఏళ్లు నిండిన మహిళా కళాశాలకు వెళ్లే విద్యార్థులందరికీ ఉచిత ఎలక్ట్రిక్ స్కూటర్లు
విద్యా భరోసా కార్డు కింద ప్రతి కళాశాలకు వెళ్లే విద్యార్థికి రూ.5 లక్షలు విద్యా ఖర్చుల కోసం
అన్ని ప్రధాన వ్యాధులను కవర్ చేసేలా ఆరోగ్యశ్రీ కింద రూ. 10 లక్షలు
జర్నలిస్టు సంక్షేమ నిధికి రూ.100 కోట్లు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు
మరణించిన జర్నలిస్టుల కుటుంబానికి రూ.2 లక్షలు, హెల్త్ కార్డులు
శారీరక వికలాంగులందరికీ ఉచిత రవాణా.
పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.
ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునికీకరణ, హెరిటేజ్ ట్యాగ్‌తో ఉస్మానియా జనరల్ ఆసుపత్రిని పునరుద్ధరించడం.
ఇళ్లు లేని పేదలకు ఒక్కొక్కరికి 5 లక్షలు.
ఇళ్లు లేని ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఇంటి నిర్మాణానికి ఇళ్ల స్థలాలు ఉంటే రూ.6 లక్షలు.
ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు.
దాదాపు 2 లక్షల ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.
ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ డీఎస్సీ ద్వారా భర్తీ చేయడం.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ద్వారా వార్షిక ఉద్యోగ క్యాలెండర్ ప్రకటన.
బాసర తరహాలో రాష్ట్రంలో 4 ఐఐఐటీల ఏర్పాటు.
రూ.2లక్షల పంట రుణాలు ఒకేసారి మాఫీ.
రూ. 3లక్షల వరకు వడ్డీ లేని పంట రుణం.
వ్యవసాయ రంగానికి 24 గంటల పాటు నిరంతరాయ ఉచిత విద్యుత్.
అన్ని ప్రధాన పంటలకు సమగ్ర పంట బీమా.
యాదవ, కుర్మ సంఘాల సభ్యులకు మేకలు, గొర్రెల పెంపకం కోసం నేరుగా రూ.2 లక్షలు.
నిర్మాణ కార్మికులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, స్విగ్గీ, జొమాటో మొదలైన గుర్తింపు లేని రంగ కార్మికులందరికీ సామాజిక భద్రతా వ్యవస్థ.
ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు పొందే అన్ని ప్రైవేట్ రంగాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు.
సమ్మక్క సారక్క పండుగను జాతీయ పండుగగా ప్రకటన.
ధరణి స్థానంలో భూమాత పోర్టల్ పునరుద్ధరణ.
కౌలు రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.15,000.
వ్యవసాయ కార్మికులకు ఏడాదికి రూ.12,000.
తెలంగాణ అమరవీరుల తల్లి, తండ్రి, జీవిత భాగస్వామికి నెలకు రూ. 25,000 గౌరవ పెన్షన్‌తోపాటు వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం.
తెలంగాణ ఉద్యమం సందర్భంగా నమోదైన వారిపై పెండింగ్‌లో ఉన్న కేసులన్నింటినీ ఉపసంహరణ.
గ్రామ పంచాయతీల అభివృద్ధి నిధులను సర్పంచ్ల ఖాతాలకు నేరుగా బదిలీ చేయడం పునరుద్ధరణ.
భూమి లేని పేదల పథకం కింద 25 లక్షల ఎకరాల భూమిని ఇచ్చిన రైతులకు యాజమాన్య హక్కుల పునరుద్ధరణ.
50 శాతం తగ్గింపుతో పెండింగ్‌లో ఉన్న పోలీసు చలాన్లు వన్‌టైమ్ సెటిల్మెంట్.
అన్ని బెల్ట్ షాపుల మూసివేత.
రాష్ట్రవ్యాప్తంగా బీసీ కులాల గణన.
సరిపడా నిధులతో కొత్త మైనారిటీ సంక్షేమ బోర్డు.
ప్రజా ఫిర్యాదులను స్వీకరించడాని, పరిష్కరించడానికి ప్రత్యేక పోర్టల్.
ఎక్సైజ్ పాలసీ సమీక్ష మరియు దేవాలయాలు, చర్చిలు, మసీదులు, పాఠశాలలు, కళాశాలలు మొదలైన వాటి చుట్టూ మద్యం దుకాణాలపై నిషేధం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com