Chiranjeevi : నిన్న హాట్ కామెంట్స్.. నేడు రియాక్షన్, చిరంజీవికి ఐడీ కార్డ్ పంపిన కాంగ్రెస్

రాజకీయాలకు దూరంగా వుంటూ సినిమాలు చేసుకుంటున్న మెగాస్టార్ చిరంజీవిపై కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఫోకస్ పెట్టిందా అంటే అవుననే అంటున్నాయి జరుగుతున్న సంఘటనలు. అధ్యక్ష ఎన్నికల వేళ... చిరంజీవికి కీలక బాధ్యతలు అప్పగించింది. పార్టీలో క్రియాశీలకంగా లేని చిరంజీవిని.. అధ్యక్ష ఎన్నికల్లో పీసీసీ డెలిగేట్‌గా నియమించింది కాంగ్రెస్ హైకమాండ్. ఈ మేరకు ఫోటోతో వున్న ఐడీ కార్డును చిరంజీవికి పంపింది. మెగాస్టార్‌కు కొవ్వూరు నియోజకవర్గ బాధ్యతలు కేటాయించారు. చిరు అక్కడి నుంచి పీసీసీ డెలిగేట్‌గా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.. ఇందుకోసమే ఏఐసీసీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ కొత్తగా కార్డు మంజూరు చేసింది. అయితే ఈ వ్యవహారం తెలుగు రాజకీయాల్లో హాట్ హాట్‌గా మారింది.

ఒక్క ట్వీట్‌తో తెలుగు రాజకీయాల్లో సంచలనం :

కాగా.. మంగళవారం చిరంజీవి వేసిన ట్వీట్ హల్ చల్ చేసింది. ‘‘తాను రాజకీయాలకు దూరం అయ్యాను కానీ.. రాజకీయం తన నుంచి దూరం కాలేదు’’ అని మెగాస్టార్ వ్యాఖ్యానించారు. ఇది జరిగిన మరుసటి రోజే ఏపీసీసీ డెలిగేట్‌గా చిరంజీవిని నియమించింది. ఆయన ఈ పదవిలో 2027 వరకు వుంటారు. ప్రస్తుతం చిరంజీవి సినిమాల్లో బిజీగా వున్నారు. పొలిటికల్ నేపథ్యం వున్న గాడ్ ఫాదర్‌లో ఆయన నటిస్తున్నారు. తాజాగా ఏఐసీసీ డెలిగేట్ కార్డ్‌ ఇష్యూ చేయడంపై టీవీల్లో డిబేట్‌లు, సోషల్ మీడియాలో భారీగా చర్చ జరుగుతోంది. కానీ దీనిపై చిరు ఎలాంటి ప్రకటనా చేయలేదు.

ప్రజారాజ్యం రిజల్ట్ తర్వాత రాజకీయాలకు దూరంగా చిరు:

ప్రజారాజ్యం పార్టీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు మెగాస్టార్. అనంతరం కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేయడంతో కేంద్ర మంత్రిగా పనిచేశాడు. తన రాజ్యసభ పదవీకాలం పూర్తయ్యే వరకు వేచి చూసిన చిరంజీవి రాజకీయాలకు దూరమయ్యారు. రాష్ట్ర విభజన కారణంగా 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని సమాధి చేశారు ఏపీ ప్రజలు. తర్వాత రాష్ట్రంలో పార్టీని పటిష్టపరిచేందుకు గాను ఏపీ పీసీసీ పగ్గాలు అందుకోవాలని చిరంజీవిని హైకమాండ్ కోరినా ఆయన ససేమిరా అన్నారు. కానీ కాంగ్రెస్‌ను మాత్రం వీడలేదు. తాజాగా ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో చిరంజీవి సేవలను వినియోగించుకోవాలని అధిష్టానం భావిస్తోంది. అందుకే ఈ హడావుడి మరి దీనిపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

More News

YS Jagan : వైసీపీకి శాశ్వత అధ్యక్షుడుగా అంటే కుదరదు.. జగన్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది.

BiggBoss: ఎదురేలేని గీతూ.. వెన్నుపోటుపై రగిలిపోతున్న రేవంత్, ఇనయా ఓవరాక్షన్

సోమవారం నాటి జోష్‌ను కంటిన్యూ చేసేలా కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ సాగుతోంది.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో "లైగర్" సంచలనం !!

తల్లి కల కోసం కరీం నగర్ నుంచి ముంబై చేరిన ఒక సాదా సీదా కుర్రాడు ఇంటర్ నేషనల్ ఎం ఎం ఏ ఫైటర్ అయిన ఒక ఇన్స్పిరేషన్ "లైగర్". పులిని సింహాన్ని తనలో

God Father: మెగా మాస్ ఫీస్ట్: చిరంజీవి - సల్మాన్ ఖాన్ 'గాడ్ ఫాదర్' ఫస్ట్ సింగిల్ 'థార్ మార్'

ఇద్దరు మెగాస్టార్లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి మెగా మాస్ జాతర సృష్టించిన గాడ్ ఫాదర్ 'థార్ మార్' సాంగ్

'ది ఘోస్ట్' సెప్టెంబర్ 25న ప్రీరిలీజ్ ఈవెంట్

కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల భారీ అంచనాల యాక్షన్ థ్రిల్లర్' ది ఘోస్ట్'