Revanth Reddy:పోస్టల్‌ బ్యాలెట్లలో కాంగ్రెస్‌దే హవా.. రేవంత్ రెడ్డి ముందంజ..

  • IndiaGlitz, [Sunday,December 03 2023]

తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది. భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ కుమార్, వర్ధన్నపేటలో నాగరాజు, ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు, పాలేరులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మధిరలో భట్టి విక్రమార్క, అశ్వారావుపేటలో ఆదినారాయణ ముందంజలో కొనసాగుతున్నారు.

నాగార్జున సాగర్‌లో‌ మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జైవీర్ రెడ్డి రెడ్డి 3 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డికి 2000 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక నల్గొండ నియోజకవర్గంలో మొదటి రౌండ్ పూర్తి అయ్యే సరికి 4000 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందంజలో ఉన్నారు. వికారాబాద్ జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ముందంజలో కొనసాగుతున్నారు. కామారెడ్డిలోనూ రేవంత్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని చోట్ల కాంగ్రెస్, సీపీఎం ఆధిక్యంలో ఉండగా.. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ కాంగ్రెస్ అభ్యర్థులు లీడ్‌లో ఉన్నారు. గజ్వేల్‌లో తొలి రౌండ్ పూర్తి అయ్యే సరికి సీఎం కేసీఆర్ ముందంజలో కొనసాగుతున్నారు. మరోవైపు మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇక అనూహ్యంగా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క పోస్టల్ బ్యాలెట్లలో ఆధిక్యంలో ఉన్నారు.

More News

Congress:రెండు రౌండ్లు ముగిసే సరికి ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థులు

కామారెడ్డిలో 4389 ఓట్ల ఆధిక్యంతో రేవంత్‌రెడ్డి.. మూడో రౌండ్‌ ముగిసే సరికి 4389 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.

KCR- Rahul Gandhi:కేసీఆర్ ఎత్తులకు కాంగ్రెస్ పైఎత్తులు.. రంగంలోకి రాహుల్ గాంధీ..

తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు అంతా సిద్ధమైంది. ఫలితాలపై ఇటు ప్రజలతో పాటు అన్ని పార్టీల నేతలు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

Congress:ఈనెల 4న కేబినెట్ భేటీపై సీఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

ఎన్నికల ఫలితాల వేళ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ రాజ్‌కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదుచేశారు.

Silk Smitha:సిల్క్ స్మిత బయోపిక్ ఫస్ట్ లుక్ విడుదల.. అదిరిపోయిందిగా..

దివంగత నటి సిల్క్‌ స్మిత జీవితం ఆధారంగా మరో బయోపిక్‌ తెరకెక్కతున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఆమె జయంతిని పురస్కరించుకుని ‘సిల్క్‌ స్మిత- ది అన్‌టోల్డ్‌ స్టోరీ’

Majority of Seats:మెజార్టీ సీట్లు రాకపోతే ఎలా..? మంతనాల్లో నిమగ్నమైన పార్టీలు..

మరికొద్ది గంటల్లో తెలంగాణ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం చేపట్టనుందో రేపటితో తేలిపోనుంది.