Revanth Reddy:పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్‌దే హవా.. రేవంత్ రెడ్డి ముందంజ..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది. భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ కుమార్, వర్ధన్నపేటలో నాగరాజు, ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు, పాలేరులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మధిరలో భట్టి విక్రమార్క, అశ్వారావుపేటలో ఆదినారాయణ ముందంజలో కొనసాగుతున్నారు.
నాగార్జున సాగర్‌లో మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జైవీర్ రెడ్డి రెడ్డి 3 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డికి 2000 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక నల్గొండ నియోజకవర్గంలో మొదటి రౌండ్ పూర్తి అయ్యే సరికి 4000 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందంజలో ఉన్నారు. వికారాబాద్ జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ముందంజలో కొనసాగుతున్నారు. కామారెడ్డిలోనూ రేవంత్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని చోట్ల కాంగ్రెస్, సీపీఎం ఆధిక్యంలో ఉండగా.. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ కాంగ్రెస్ అభ్యర్థులు లీడ్‌లో ఉన్నారు. గజ్వేల్‌లో తొలి రౌండ్ పూర్తి అయ్యే సరికి సీఎం కేసీఆర్ ముందంజలో కొనసాగుతున్నారు. మరోవైపు మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇక అనూహ్యంగా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క పోస్టల్ బ్యాలెట్లలో ఆధిక్యంలో ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com