Congress, Brs:దక్షిణ, ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్.. గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ హవా..

  • IndiaGlitz, [Sunday,December 03 2023]

దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీ కనబరుస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో క్లీన్ స్వీప్ దిశగా కొనసాగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 స్థానాల్లో 9 స్థానాల్లో కాంగ్రెస్, దాని మిత్రపక్షం సీపీఐ కొత్తగూడెం స్థానంలో సీపీఐ ముందుంది. ఇక నల్గొండ జిల్లాలో 12 స్థానాలకు గాను 11 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మహబూబ్‌నగర్‌లో 14 స్థానాలకు గాను 10 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనాసాగుతుండగా.. బీఆర్ఎస్ స్థానాల్లో ముందంజలో ఉంది.

మరోవైపు అనూహ్యంగా ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో 9 స్థానాల్లో కాంగ్రెస్, 3 స్థానాల్లో బీఆర్ఎస్ ముందంజలో ఉన్నాయి. ఇటు కరీంనగర్ జిల్లాలో 9 స్థానాల్లో, బీఆర్ఎస్ 4 స్థానాల్లో నిజామాబాద్ జిల్లాలో 5 స్థానాల్లో కాంగ్రెస్, 2 స్థానాల్లో బీజేపీ, మరో 2 స్థానాల్లో బీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. అటు ఆదిలాబాద్ జిల్లాలోని 4 స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ 4 స్థానాలు, బీఆర్ఎస్ 2 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

ఇదిలా ఉంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం గులాబీ పార్టీ తన పట్టు నిలబెట్టుకుంది. రంగారెడ్డి జిల్లాలో 10 స్థానాల్లో ఆ పార్టీ ముందంజలో ఉండగా.. కాంగ్రెస్ 4 స్థానాల్లో, బీజేపీ హైదరాబాద్‌ జిల్లాలో చెరో 5 స్థానాల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఉండగా.. కాంగ్రెస్ 2 స్థానాల్లో, ఎంఎఐం 3 స్థానాల్లో లీడ్‌లో ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ 5 స్థానాల్లో ఉండగా.. బీఆర్ఎస్ కూడా 5 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

మొత్తంగా చూసుకుంటే దక్షిణ, ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ దూసుకుపోతుండగా.. గ్రేటర్‌ పరిధిలో మాత్రం బీఆర్ఎస్ కొంత ఆధిక్యం కనబరుస్తోంది.