తెలంగాణ లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ ఇంఛార్జ్లు నియామకం
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం ప్రణాళికలు రచిస్తోంది. ఈమేరకు రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంఛార్జీలను నియమిస్తూ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ ఉత్తర్వులు జారీ చేశారు.అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అదే ఊపును కొనసాగించాలని డిసైడ్ అయింది. దీంతో ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా తన పాలనకు పార్లమెంట్ ఎన్నికలే నిదర్శనంగా నిలుస్తాయని బహిరంగంగానే చెప్పారు. ఈ నేపథ్యంలో 12-14 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా దేశ మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి ఉత్తరాధి రాష్ట్రాల్లో కంటే దక్షిణాదిలోనే బలం ఉంది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలో కూడా ఉంది. అలాగే కేరళలో యూడీఎఫ్ కూటమితో చాలా బలంగా కనిపిస్తుంది. అందుకే దక్షిణాది రాష్ట్రాల్లో వీలైనంత ఎక్కువ స్థానాలు గెలిచి పట్టు నిలుపుకోవాలని చూస్తోందతి.
ఇంఛార్జీలు వీరే..
1. ఖమ్మం- పొంగులేటి శ్రీనివాసరెడ్డి
2. నల్గొండ - ఉత్తమ్ కుమార్ రెడ్డి
3. కరీంనగర్ - పొన్నం ప్రభాకర్
4. పెద్దపల్లి - శ్రీధర్ బాబు
5. మహబూబాబాద్ - తుమ్మల నాగేశ్వరరావు
6. వరంగల్ - ప్రకాష్ రెడ్డి
7. హైదరాబాద్ - ఒబేదుల్లా కొత్వాల్
8. సికింద్రాబాద్ - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
9. భువనగిరి - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
10. చేవెళ్ల - నరేందర్ రెడ్డి
11. నాగర్ కర్నూల్ - జూపల్లి కృష్ణారావు
12. మెదక్ - కొండా సురేఖ
13. నిజామాబాద్ - సుదర్శన్ రెడ్డి
14. మల్కాజిగిరి - మైనంపల్లి హన్మంతరావు
15. ఆదిలాబాద్ - సీతక్క
16. జహీరాబాద్ - దామోదర రాజనర్సింహ
17. మహబూబ్ నగర్ - సంపత్ కుమార్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments