Addanki Dayakar: అద్దంకి దయాకర్‌కు మళ్లీ మొండిచెయ్యే.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరంటే..?

  • IndiaGlitz, [Wednesday,January 17 2024]

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. చివరి నిమిషంలో అద్దంకి దయాకర్‌కు మరోసారి తీవ్ర నిరాశ ఎదురైంది. రెండు ఎమ్మెల్సీలను బల్మూరి వెంకట్‌, బొమ్మ మహేష్‌కుమార్‌ గౌడ్‌కి కేటాయించింది. ఈ మేరకు ఏఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మంగళవారం అద్దంకి దయాకర్‌, బల్మూరి వెంకట్‌లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే ఆఖరి నిమిషంలో పేర్లు మారుస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. నామినేషన్లకు గురువారమే చివరి తేదీ కావడంతో నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకోవాలని వారిద్దరికీ ఫోన్ చేసి చెప్పింది. కాగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దయాకర్‌ను వరంగల్ ఎంపీ స్థానానికి పోటీ చేయించాలని భావిస్తున్నారట.

తెలంగాణలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జనవరి 18న నామినేషన్లకు చివరి తేదీగా ప్రకటించింది. జనవరి 29వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్ర 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం కౌంటింగ్ జరిపి ఫలితాలను ప్రకటించనున్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల బలం దృష్ట్యా రెండు ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ దక్కించుకోనుంది. సామాజిక సమీకరణాలతో పాటు మిగతా అంశాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

అలాగే గవర్నర్ కోటాకు సంబంధించి ప్రొఫెసర్ కోదండరామ్, జావెద్ అలీ ఖాన్ కుమారుడు అమీర్ అలీ ఖాన్ పేర్లను కూడా దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే సీనియర్ నేతలకు మాత్రం నిరాశే ఎదురైంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలు షబ్బీర్ అలీ, జగ్గారెడ్డి, అంజనీకుమార్ యాదవ్, అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్, మధుయాష్కీ గౌడ్‌లు ఎమ్మెల్సీ టికెట్లు ఆశించారు. వీరితో కొంతమందికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవులు ఇస్తారనే చర్చ కూడా జరిగింది. కానీ అధిష్టానం మాత్రం వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని వీరెవరికి టికెట్ నిరాకరించింది. అయితే వీరికి కేబినెట్ హోదాతో కూడిన నామినేటెడ్ పదవులు లేదా లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ టికెట్లు కేటాయించే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.

More News

Jagan vs Sharmila: అన్నాచెల్లెళ్ల సవాల్.. జగన్‌ను 'ఢీ' కొట్టబోతున్న షర్మిల..

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైయస్ షర్మిల ఎంపికైన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర రాజకీయాలు అన్నాచెల్లెళ్ల సవాల్‌గా మారాయి. వైసీపీకి సీఎం జగన్ అధినేతగా ఉండగా..

ఫైబర్‌ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ట్విస్ట్

ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ విచారణలో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఈ కేసును ఇవాళ విచారించాల్సిన జస్టిస్ అనిరుద్ధ బోస్

Balakrishna: 'హనుమాన్' సినిమాను చూసిన బాలకృష్ణ.. మూవీ యూనిట్‌పై ప్రశంసలు..

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా వచ్చిన 'హనుమాన్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఆంజనేయస్వామిని సూపర్ హీరోగా పరిచయం చేస్తూ తీసిన

Chandrababu: అయోధ్యకు రావాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానం

యావత్ ప్రపంచం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సమయం దగ్గర పడింది. జనవరి 22న జరిగే ఈ చారిత్రాత్మక వేడుకకు

Revanth Reddy: దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి బిజీజిజీ.. దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ..

రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్‌లో పర్యటిస్తున్నారు. గత మూడు రోజులుగా ప్రపంచ ఆర్థిక సదస్సులో రేవంత్ అండ్ టీమ్ బిజీబిజీగా గడుపుతోంది.