స్మృతి పై విమర్శలకు దిగిన కాంగ్రెస్
Send us your feedback to audioarticles@vaarta.com
స్మృతి ఇరానీ.... కేంద్ర మంత్రి... కానీ తానేం చదివిందో తనకే తెలియడం లేదు. ఓసారి బీ.ఏ. అంటుంది... మరోసారి బీ. కామ్ అంటుంది... ఇంకోసారి అసలు నేను డిగ్రీ పూర్తి చేయలేదు అంటుంది... ఒక్కోసారి లేదు నేను యేల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందానని ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్తుంది. ఆమె అసలు ఏ పట్టా పొందిందో... ఏం చదివిందో దేవుడు ఎరుగు కానీ... ఆమె ప్రతి ఎన్నికల్లో ఒక్కో డిగ్రీ చెప్తుండడంతో ప్రతిపక్షాల విమర్శలకు మాత్రం చిక్కింది.
2004 లో డిగ్రీ యూనివ్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందానని నామినేషన్ లో పేర్కొన్న స్మృతి... 2014 ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేసి బీ.కామ్ కోసం ఢిల్లీ యూనివర్సిటీ దూరవిద్య లో ప్రవేశం పొందినట్లు నామినేషన్ పత్రాల్లో పేర్కొంది. ఇక ఇప్పుడు మళ్లీ అమేథీ నుంచి బరిలోకి దిగుతున్నాడు స్మృతి ఇరానీ... నేను గ్రాడ్యుయేట్ చేయలేదు అని చెప్తోంది.
ఇది ఇలా ఉంటే... 2014లో ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన కేంద్ర మంత్రి ... నేను ప్రతిష్టాత్మక యేల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ కంప్లీట్ చేసినట్లు చెప్పింది. దీంతో స్మృతి పై విమర్శలకు దిగిన కాంగ్రెస్... తాజాగా దాఖలు చేసిన నామినేషన్ లో ఎందుకు డిగ్రీ పూర్తి చేసినట్లు పేర్కొనలేదు అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు ఒక్క డిగ్రీ మారుతుందా అని ఎద్దేవా చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Iniya Vaishnavi
Contact at support@indiaglitz.com
Comments