Congress Party:తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ బోణీ.. రెండు చోట్ల విజయం..

  • IndiaGlitz, [Sunday,December 03 2023]

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆశ్వారావుపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ.. బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై 28,358 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇక ఇల్లందులోనూ కాంగ్రెస్ అభ్యర్థి కొరం కనకయ్య.. బీఆర్ఎస్ అభ్యర్థి హరిప్రియ నాయక్‌పై 18 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఖమ్మంలో 10 స్థానాలకు గాను 2 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. ఒక చోట సీపీఐ ఆధిక్యంలో ఉంది.

ఇక మరో 63 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతుండగా.. బీఆర్ఎస్ అభ్యర్థులు 40 చోట్ల ముందంజలో ఉన్నారు. బీజేపీ 8 స్థానాల్లో లీడ్‌లో ఉన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ సీట్లలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది.

మరోవైపు ఈ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని 8 స్థానాల్లో పోటీ చేసిన జనసేన ప్రభావం పెద్దగా కనిపించలేదు. కూకట్‌ పల్లిలో ఆ పార్టీ అభ్యర్థి ప్రేమ్ కుమార్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. మిగిలిన 7చోట్ల అయితే ఆ పార్టీకి డిపాజిట్లు కూడా వస్తాయో లేదో అనే పరిస్థితి నెలకొంది.

More News

BJP-Congress:మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో బీజేపీ.. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం..

తెలంగాణతో పాటు మిగిలిన మూడు రాష్ట్రాల్లోనూ కౌంటింగ్ ప్రారంభమైంది. మధ్యప్రదేశ్‌లో ఇప్పటి వరకూ జరిగిన కౌంటింగ్‌లో బీజేపీ 118 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా..

Bigg Boss Telugu 7 : అమర్‌‌కు ఊహించని సర్‌ప్రైజ్.. కానీ కండీషన్ , మరోసారి గౌతమ్ - శివాజీల గొడవ

బిగ్‌బాస్ తెలుగు 7 మరికొద్దిరోజుల్లో ముగియనుంది. ఈ వారం నిర్వహించిన టికెట్ టు ఫినాలే టాస్క్‌ల్లో విజయం సాధించి అర్జున్ అంబటి ఈ సీజన్‌లో

Revanth Reddy:పోస్టల్‌ బ్యాలెట్లలో కాంగ్రెస్‌దే హవా.. రేవంత్ రెడ్డి ముందంజ..

తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది.

Congress:రెండు రౌండ్లు ముగిసే సరికి ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థులు

కామారెడ్డిలో 4389 ఓట్ల ఆధిక్యంతో రేవంత్‌రెడ్డి.. మూడో రౌండ్‌ ముగిసే సరికి 4389 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.

KCR- Rahul Gandhi:కేసీఆర్ ఎత్తులకు కాంగ్రెస్ పైఎత్తులు.. రంగంలోకి రాహుల్ గాంధీ..

తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు అంతా సిద్ధమైంది. ఫలితాలపై ఇటు ప్రజలతో పాటు అన్ని పార్టీల నేతలు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.