ఎన్టీఆర్‌కు అభినందనల వెల్లువ
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన సినిమా 'జై లవకుశ'. ఈ సినిమా సెప్టెంబర్ 21న విడుదలవుతుంది. సాధారణంగా ఏ తల్లికైనా ముగ్గురు బిడ్డలు పుడితే రామ లక్ష్మణ భరతులు కావాలనుకుంటుంది. కానీ మేం మాత్రం రావణ రామ లక్ష్మణులమయ్యాం అనే కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాకు కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకుడు.
ఈ సినిమా ట్రైలర్‌లో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో చేసిన నటనకు ఇండస్ట్రీ అంతా శెహభాష్ అని అంటుంది. పలువురు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. వాటిలో కొన్ని..
- శోభూ యార్లగడ్డ - సినిమా చూడడానికి చాలా ఆతృతగా ఉంది. దీనికి మించి ఇంకేమి చెప్పగలం
- సాయిధరమ్ తేజ్ - చ.. చ.. చంపేశావ్`
- వెన్నెల కిశోర్ - కిక్కాస్.. ట్రిపుల్ ధమాకా`
- రాజ్‌తరుణ్ - అదరహో
- ఈషా రెబ్బా - అద్భుతమైన ట్రైలర్.. చిత్ర బృందానికి కంగ్రాట్స్
- గోపీచంద్ మలినేని - అదిరింది.. తారక్ ఉత్తమైన ప్రదర్శన
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments