'పద్మావతి'కి వ్యతిరేకంగా గొడవలు..
Send us your feedback to audioarticles@vaarta.com
దీపికా పదుకొనె టైటిల్ పాత్రలో రూపొందుతోన్న చిత్రం 'పద్మావతి'. సంజయ్ లీలా బన్సాలీ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. చారిత్రాత్మక నేపథ్యమున్న ఈ చిత్రంలో మహారావల్ రతన్ సింగ్ పాత్రలో షాహిద్ కపూర్, అల్లావుద్తీన్ ఖిల్జీ పాత్ర రణవీర్ సింగ్‌లు నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై నిర్మాణం నుండి వివాదలు చేలరేగుతూనే ఉన్నాయి.
గుజరాత్‌లో అయితే ఈ సినిమాను ఎన్నికల వరకు విడుదల చేయకూడదని భాజపా కోరుతోంది. ఇప్పుడు రాజస్థాన్‌లో రాజ్‌పుత్ కర్ణిసేన సభ్యులు చిత్తోర్‌ఘర్‌లో పెద్ద ఎత్తున బంద్ నిర్వహించారు. పద్మావతి, ఖిల్జీ మధ్య సన్నివేశాలను అభ్యంతరంగా ఉంటే ఒప్పుకోమని, విడుదలకు ముందుగానే సినిమాను తమ ప్రతినిధులకు చూపెట్టాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. సినిమా డిసెంబర్ 1న విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com