Vijayasai Reddy: ఏపీ, తెలంగాణ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలి: విజయసాయి రెడ్డి

  • IndiaGlitz, [Tuesday,January 09 2024]

ఏపీతో పాటు తెలంగాణ లోక్‌సభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ఎన్నికల బృందాన్ని అభ్యర్థించారు. విజయవాడలో సీఈసీ బృందం రాజకీయల పార్టీల నేతలో సమావేశమైంది. ఈ సందర్భంగా వైసీపీ తరపున వారిని కలిసిన విజయసాయిరెడ్డి పలు అంశాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే దొంగ ఓట్లను నిలువరించవొచ్చని సీఈసీకి తెలియజేశామన్నారు. తెలంగాణలో ఓటర్లుగా నమోదైన వారంతా ఏపీలో కూడా ఓటు నమోదు చేసుకున్నారని.. రెండు చోట్ల ఓటు వేయకుండా నిరోధించాలని కోరామని తెలిపారు.

అలాగే గుర్తింపు లేని జనసేన పార్టీని మీటింగ్‌కు ఎలా అనుమతించారనే విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. జనసేనను ఇప్పటివరకు బీజేపీ భాగస్వామ్య పార్టీగా పరిగణిస్తూ వచ్చారని.. కానీ ఎన్నికల సంఘానికి ఇచ్చిన అభ్యర్థనలో జనసేన పార్టీని టీడీపీ భాగస్వామ్య పార్టీ అని ఎలా తెలుపుతారని ప్రశ్నించామన్నారు. జనసేన పార్టీ అసలు బీజేపీ భాగస్వామ్య పక్షమా.. టీడీపీ భాగస్వామ్య పక్షమా అనేది తెలియడం లేదన్నారు. అలాంటి పార్టీని అనుమతించం సమంజసమేనా అనే విషయాన్ని సీఈసీ ఎదుట ప్రస్తావించామని ఆయన చెప్పుకొచ్చారు.

జనసేన అనేది ఒక గుర్తింపులేని రాజకీయ పార్టీ అని.. గ్లాసు గుర్తు అనేది జనరల్ సింబల్ అన్నారు. రాష్ట్రంలోని 175 స్థానాల్లో కేవలం కొన్ని స్థానాల్లోనే పోటీ చేసే ఒక పార్టీకి సాధారణ గుర్తుల్లోంచి ఒక సింబల్ కేటాయించడం చట్ట విరుద్ధమని కూడా వివరించామని విజయసాయి రెడ్డి వెల్లడించారు. తక్షణమే జనసేనకు గాజు గ్లాస్ గుర్తు ఇవ్వకుండా చూడాలని కోరినట్లు ఆయన చెప్పారు.

కాగా అంతకుముందు కేంద్ర ఎన్నికల అధికారులను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కలిశారు. రాష్ట్రంలోని ఓటర్ల జాబితాల్లో నమోదవుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే వాలంటీర్లతో పాటు సచివాలయ సిబ్బంది ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలిని వారు ఈసీ బృందాన్ని కోరారు.

More News

YS Jagan: నాడు వైయస్సార్.. నేడు వైయస్ జగన్.. సేమ్ సిట్యుయేషన్..

సింహాన్ని ఎదుర్కోవడానికి గుంటనక్కలన్ని ఒక్కటవుతున్నాయి. కానీ ఆ గుంటనక్కలకు తెలియదు ఏమిటంటే సింహాం గర్జన ముందు తట్టుకుని నిలబడలేవని..

Dil Raju: తనపై తప్పుడు వార్తలు రాసిన సినీ జర్నలిస్టుకు దిల్ రాజు వార్నింగ్.. వీడియో వైరల్

ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) మరోసారి వార్తల్లో నిలిచారు. గత కొద్దిరోజుల నుంచి ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. తనపై తప్పుడు వార్తలు రాసిన వారి తాటతీస్తా...

పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిన పచ్చడి.. బండ్ల గణేశ్‌ డ్రైవర్ అరెస్ట్..

ప్రస్తుత సమాజంలో యువత ఓపికగా ఉండటానికి ఇష్టపడటం లేదు. దీంతో క్షణికావేశంలో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చిన్న చిన్న కారణాలతో ప్రాణాలు తీసుకుంటున్నారు

60 మంది అభ్యర్థులతో టీడీపీ తొలి జాబితా.. త్వరలోనే విడుదల..

ఏపీలో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఇప్పటికే అధికార వైసీపీ అభ్యర్థులను ఖరారు చేసి రెండు జాబితాలను విడుదల చేయగా.. మూడో జాబితాపై కూడా కసరత్తు చేస్తోంది.

Chandrababu, Pawan Kalyan: ఎన్నికల బృందంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ.. ఓట్ల అవకతవకలపై ఫిర్యాదు.

ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. మరో రెండు నెలల్లోనే పోలింగ్ జరగనుంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల ఖరారుతో పాటు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.