ప్రకాశం: కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వైద్యురాలి పరిస్థితి విషమం
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రకాశం జిల్లాలో కరోనా వ్యాక్సిన్ వికటించింది. ఆ వ్యాక్సిన్ వేయించుకున్న ధనలక్ష్మి అనే యువ డాక్టర్ పరిస్థితి విషమంగా మారింది. ఒంగోలు జీజీహెచ్‌తో పాటు సంఘమిత్ర ఆస్పత్రిలోనూ చికిత్సను అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో మెరుగైన వైద్యం కోసం డాక్టర్ ధనలక్ష్మిని చెన్నై తరలించారు. ధనలక్ష్మి ఒంగోలు జీజీహెచ్‌లో డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఈ నెల 23న కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.
మరుసటి రోజు నుంచే అంటే ఈ నెల 24 నుంచి ధనలక్ష్మి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్సను అందిస్తుండగానే ఆమెకు జ్వరం ఎక్కువ కావడంతో పాటు ఒక్కసారిగా బీపీ తగ్గిపోయింది. వెంటనే అప్రమత్తమైన జీజీహెచ్ వైద్యులు చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రి సంఘమిత్రకు తరలించారు. అయితే అక్కడ కూడా ఫలితం లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం డాక్టర్ ధనలక్ష్మిని చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు.
అలాగే గుంటూరులోనూ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న అంగన్‌వాడీ కార్యకర్త అస్వస్థతకు గురయ్యింది. నేడు గుంటూరులో అంగన్‌వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఆ ధర్నాలో పాల్గొన్న రాధ అనే అంగన్‌వాడీ కార్యకర్త స్పృహ తప్పి పడిపోయింది. రెండు రోజు క్రితం రాధ కరోనా వ్యాక్సిన్ వేయించుకుంది. వెంటనే ఆమెను తోటి అంగన్‌వాడీ కార్యకర్తలు జీజీహెచ్‌కు తరలించారు. తెలుగు రాష్ట్రాల్లో తలెత్తుతున్న వరుస ఘటనలతో కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలంటేనే ఫ్రంట్ లైన్ వారియర్స్ భయపడిపోతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout