Nara Lokesh: జైల్లో చంద్రబాబుపై భద్రతపై ఆందోళనగా ఉంది: లోకేశ్
Send us your feedback to audioarticles@vaarta.com
జైల్లో చంద్రబాబు భద్రతపై తమకు ఆందోళనగా ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. జైలుపై దాడి చేస్తామని కొందరు లేఖ రాశారని.. మరికొందరు జైలుపై నుంచి డ్రోన్స్ ఎగరవేశారన్నారు. జైల్లో నక్సల్స్, గంజాయి అమ్మేవారు ఉన్నారని తెలిపారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు నారా భువనేశ్వరి, బ్రాహ్మణితో కలిసి లోకేశ్ ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నాలుగున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం చేసిన తప్పులను బయటకు తీసుకొచ్చినందుకే చంద్రబాబును జైలుకు పంపారని తెలిపారు. వ్యవస్థలను మేనుఏజ్ చేసి రిమాండ్‌కు తరలించారని లోకేశ్ ఆరోపణలు చేశారు.
కక్ష సాధింపుతోనే చంద్రబాబును జైలుకు పంపారు..
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసే ముందు రూ.3వేల కోట్ల కుంభకోణం జరిగిందన్నారని, తర్వాత రూ.370 కోట్లని.. ఇప్పుడు రూ.27కోట్లు అని మాట మార్చారని విమర్శించారు. కేవలం రాజకీయ కక్ష సాధింపుతోనే చంద్రబాబును జైలుకు పంపారన్నారు. న్యాయం ఆలస్యం కావచ్చేమో కానీ, తమ వైపే ఉంటుందని పేర్కొ్న్నారు. చంద్రబాబు ఏనాడూ తప్పు చేయలేదని, రిమాండ్‌లో ఉంచినా ఆయన అధైర్య పడలేదన్నారు. పోరాటం ఆపవద్దు, శాంతియుతంగా పోరాడాలని తమతో చెప్పారని లోకేశ్ స్పష్టం చేశారు.
వైసీపీకి రూ.100కోట్లు ఎలా వచ్చాయో చెప్పే దమ్ముందా..?
ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా 2018లో వచ్చిన రూ.27కోట్ల గురించి టీడీపీ ఖాతాలోకి వచ్చాయని చెబుతున్నారని.. మరి 2018-19లో అధికారంలో లేకపోయినా వైసీపీకి రూ.100కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వచ్చాయన్నారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో.. ఎవరు ఇచ్చారో ఆధారాలు బయటపెట్టే దమ్ముందా అని సీఎం జగన్‌ను లోకేశ్ ప్రశ్నించారు. చంద్రబాబుకు జరిగిన అన్యాయాన్ని గడప గడపకు ‘బాబుతో నేను’ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వివరిస్తామని పేర్కొన్నారు.
కాంతితో క్రాంతి పేరిట నిరసనకు పిలుపు..
చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా రేపు(శనివారం) రాత్రి 7.00 గంటల నుంచి 7.05 నిమిషాల వరకూ నిర్వహించే ‘కాంతితో క్రాంతి’ పేరిట ఇళ్లలో లైట్లు ఆపి, దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్‌లైట్ వెలిగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రోడ్లు మీద ఉంటే వాహనాల లైట్లు బ్లింక్ చేయడం ద్వారా చంద్రబాబుకి సంఘీభావం తెలపాలని కోరారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments