కుమారి 21 ఎఫ్ పై హెచ్.ఆర్.సిలో ఫిర్యాదు..
Send us your feedback to audioarticles@vaarta.com
డైరెక్టర్ సుకుమార్ నిర్మాతగా మారి తొలి ప్రయత్నంగా నిర్మించిన చిత్రం కుమారి 21 ఎఫ్. సుకుమార్ శిష్యుడు సూర్య ప్రతాప్ తెరకెక్కించిన కుమారి 21 ఎఫ్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ చిత్రానికి సుకుమార్ కథ, కథనం అందించడం విశేషం. యూత్ ను విశేషంగా ఆకట్టుకుంటున్న కుమారి 21 ఎఫ్ మూవీని తక్షణమే నిషేధించాలంటూ హెచ్.ఆర్.సి లో బొగ్గుల శ్రీనివాస్ ఫిర్యాదు చేసారు. ఈ సినిమాలో సన్నివేశాలు ఆడవాళ్లను కించపరిచేలా ఉన్నాయని..నిర్మాత, రచయిత సుకుమార్, హీరో రాజ్ తరుణ్, డైరెక్టర్ సూర్య ప్రతాప్ లపై కేసులు పెట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. శ్రీనివాస్ ఫిర్యాదు పై స్పందించిన హెచ్.ఆర్.సి ఛైర్మెన్ ఫిబ్రవరిలోగా నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ పోలీసు కమీషనర్ ను ఆదేశించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com