రాహుల్ గాంధీ పౌరసత్వం పై ఫిర్యాదు.. నోటీసులు జారీ
Send us your feedback to audioarticles@vaarta.com
కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. రాహుల్ విదేశీ పౌరసత్వం కలిగి ఉన్నారని బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుబ్రమ్మణ్యస్వామి హోంశాఖకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రాహుల్‌కు హోం శాఖ నోటీసులిచ్చింది.
దీనిపై 15రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. మొత్తానికి చూస్తే ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బేనని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే రాహుల్ 15 రోజుల్లో ఎలాంటి వివరణ ఇస్తారో వేచి చూడాల్సిందే మరి.
కాగా.. సుబ్రమణ్యం స్వామి ఎప్పుడూ కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తుంటారని నేతలు చెబుతున్నారు. కేంద్ర హోం శాఖ ఆయనకు అనుకూలంగా ఉంటుంది గనుక ఇలాంటి ఫిర్యాదులు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఎన్నికల సీజన్ మొదలైనప్పట్నుంచి ప్రధాని మోదీ తాను సాధారణ కుటుంబం నుంచి వచ్చానని.
ఇలా పలు ఆసక్తికర విషయాలు చెప్పిన ఆయన కాంగ్రెస్‌లో ఇరకాటంలోకి నెట్టేందుకేనని విశ్లేషకులు చెబుతున్నారు. పైగా రాహుల్ గాంధీ పొలిటికల్ బ్యాగ్రౌండ్, ధనిక కుటుంబం నుంచి ఆయన వచ్చారనే ముద్ర వేయడానికే ఇలా చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు సుబ్రమణ్యం స్వామిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments