ప్ర‌కాష్‌రాజ్‌ను సినిమాల నుండి నిషేధించాలంటూ ఫిర్యాదు

  • IndiaGlitz, [Thursday,October 31 2019]

బ‌హుభాషా న‌టుడు ప్ర‌కాష్‌రాజ్‌ను సినిమాల నుండి బ‌హిష్క‌రించాల‌ని క‌ర్ణాట‌క చ‌ల‌న చిత్ర వాణిజ్య మండ‌లిలో అఖిల భార‌త హిందూ మ‌హా స‌భ వేదిక ఫిర్యాదు చేసింది. హిందూ దేవుళ్ల‌ను, హిందువ‌లు మ‌నో భావాల‌ను దెబ్బ తినేలా ఆయ‌న మాట్లాడార‌ని వారు త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న్ని క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ నుండి బ‌హిష్క‌రించాల‌ని, క‌న్న‌డ సినిమాల్లో న‌టించే అవ‌కాశం క‌ల్పించ‌రాదంటూ పేర్కొంది. అలా కాద‌ని అవ‌కాశం ఇస్తే ఇక‌పై త‌మ పోరాటం ఉధృత‌మ‌వుతుంద‌ని సద‌రు అఖిల భార‌త హిందూ మ‌హా స‌భ వేదిక స‌భ్యులు పేర్కొన్నారు.

ఇటీవ‌ల ఓ క‌న్న‌డ టీవీ ఛానెల్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ప్ర‌కాష్‌రాజ్ చేసిన వ్యాఖ్య‌లు వివాద‌స్ప‌ద‌మ‌య్యాయి. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని ర‌థోత్స‌వానికి ముంబై నుండి మోడ‌ళ్ల‌ను సీఎం ఆదిత్య‌నాథ్ ర‌ప్పిస్తున్నార‌ని, వారికి రామ‌, సీత‌, లక్ష్మ‌ణుల్లా మేక‌ప్ వేసి ఘ‌నంగా స్వాగ‌తం ప‌లుకుతార‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ విధ‌మైన చ‌ర్య‌లు చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని ఆయ‌న తెలిపారు. అంద‌రి మ‌నోభావాల‌కు విలువ ఇవ్వాల‌ని వ్యాఖ్యాత కోరిన‌ప్పుడు చిన్న పిల్ల‌లు అశ్లీల వీడియోలు చూస్తుంటే మ‌నం మౌనంగా ఎలా ఉంటాం. ప్ర‌మాద‌క‌ర‌మైన చ‌ర్య‌ల‌ను ప్ర‌శ్నించాల‌ని, మైనారిటీల‌ను భ‌య‌పెట్టే ప‌నులు చేస్తే ఎలా అని ప్ర‌శ్నించారు.

More News

టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న'నిన్నే పెళ్లాడతా'

ఈశ్వరి ఆర్ట్స్ పతాకంపై అమన్(రకుల్ ప్రీత్ సింగ్ బ్రదర్)  ,సిద్ధిక హీరోహీరోయిన్లుగా వైకుంఠ బోను దర్సకత్వంలో  

గీతాంజలి మృతి ‘మా’కు తీరని లోటు!

టాలీవుడ్‌ సీనియర్ నటి గీతాంజలి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా గుండెపోటుతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో

టాలీవుడ్ సీనియర్ నటి గీతాంజలి ఇకలేరు

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటి గీతాంజలి కన్నుమూశారు.

శివసేనకు బీజేపీ కొత్త బంపరాఫర్.. రాజీ కుదిరేనా!?

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై దాదాపు కొలిక్కి వచ్చేసినట్లేనని తెలుస్తోంది.

'భాస్కర్ ఒక రాస్కల్ ' గా వస్తున్న అరవింద స్వామి

అరవిందస్వామి, అమలాపాల్ ప్రధాన పాత్రలలో సిద్ధికీ తమిళంలో రూపొందిన భాస్కర్ ఓరు రాస్కల్  ఇప్పడు తెలుగులో భాస్కర్