ప్రకాష్‌రాజ్‌ను సినిమాల నుండి నిషేధించాలంటూ ఫిర్యాదు
Send us your feedback to audioarticles@vaarta.com
బహుభాషా నటుడు ప్రకాష్‌రాజ్‌ను సినిమాల నుండి బహిష్కరించాలని కర్ణాటక చలన చిత్ర వాణిజ్య మండలిలో అఖిల భారత హిందూ మహా సభ వేదిక ఫిర్యాదు చేసింది. హిందూ దేవుళ్లను, హిందువలు మనో భావాలను దెబ్బ తినేలా ఆయన మాట్లాడారని వారు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ని కన్నడ చిత్ర పరిశ్రమ నుండి బహిష్కరించాలని, కన్నడ సినిమాల్లో నటించే అవకాశం కల్పించరాదంటూ పేర్కొంది. అలా కాదని అవకాశం ఇస్తే ఇకపై తమ పోరాటం ఉధృతమవుతుందని సదరు అఖిల భారత హిందూ మహా సభ వేదిక సభ్యులు పేర్కొన్నారు.
ఇటీవల ఓ కన్నడ టీవీ ఛానెల్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాష్‌రాజ్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. ఉత్తర ప్రదేశ్‌లోని రథోత్సవానికి ముంబై నుండి మోడళ్లను సీఎం ఆదిత్యనాథ్ రప్పిస్తున్నారని, వారికి రామ, సీత, లక్ష్మణుల్లా మేకప్ వేసి ఘనంగా స్వాగతం పలుకుతారని ఆయన పేర్కొన్నారు. ఈ విధమైన చర్యలు చాలా ప్రమాదకరమని ఆయన తెలిపారు. అందరి మనోభావాలకు విలువ ఇవ్వాలని వ్యాఖ్యాత కోరినప్పుడు చిన్న పిల్లలు అశ్లీల వీడియోలు చూస్తుంటే మనం మౌనంగా ఎలా ఉంటాం. ప్రమాదకరమైన చర్యలను ప్రశ్నించాలని, మైనారిటీలను భయపెట్టే పనులు చేస్తే ఎలా అని ప్రశ్నించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout