ఎన్టీఆర్ బిగ్ బాస్ పై పిర్యాదు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా స్టార్ మా టీవీవారు ప్రసారం చేస్తున్న రియాలిటీ షో బిగ్బాస్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ రియాలిటీ షోలో పాల్గొంటున్న కంటెస్టెంట్లకు విధిస్తున్నశిక్షలు అమానీయంగా ఉన్నాయంటూ సామాజిక కార్యకర్త అచ్చుతరావు రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి పిర్యాదు చేశారు.
శిక్షల పేరుతో నోటికి ప్లాస్టర్స్వేయడం, ఉల్లిపాయలు గంటలు పాటు తరిగించడం, స్విమ్మింగ్ఫూల్లో 50 సార్లు మునిగి తేలమని చెప్పడం, రాత్రి సమయాల్లో గార్డెన్లో పడుకోమనడం వంటి చర్యలు వ్యక్తిగత స్వేచ్చను హరిస్తున్నాయని, ఇలాంటి చర్యలు వల్ల యువత తప్పుదోవ పట్టే అవకాశ ఉందని అచ్యుతరావు పిటిషన్ను దాఖలు చేశారు. ఈ పిటిషన్పై మానవ హక్కుల విచారణ సంఘం స్పందించలేదు. స్పందిస్తే నిర్వాహకులకు నోటీసులు పంపిస్తారు మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout