డీజేపై మినిష్టర్ కు కంప్లైంట్.....
Send us your feedback to audioarticles@vaarta.com
స్లైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన చిత్రం `డీజే దువ్వాడ జగన్నాథమ్`. జూన్ 23న సినిమా విడుదల కానుంది. పూజాహెగ్డే హీరోయిన్. ఈ సినిమాలో అస్మైక రాగ..అనే పాటను సోషల్ మీడియాలో విడుదల చేసినప్పుడు వివాదాలు వచ్చాయి.
పాటలలోని నమకం, చమకం అనే పదాలను తొలగించాలని బ్రహ్మణ సంఘాలు డిమాండ్ చేశాయి. ముందు దర్శకుడు హరీష్ ఆ పదాలను తొలగిస్తానని చెప్పిన తర్వాత తొలగించకుండానే పాటలను విడుదల చేసేశారు. దాంతో బ్రహ్మణ సంఘాలు సదరు పాటలోని పదాలను తొలగించాలని తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాసయాదవ్‌కు కంప్లైంట్ ఇచ్చారు. మరి మంత్రి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments