రామ్ సినిమాకి ట్రబుల్.. దర్శకుడిపై ఫిర్యాదు, ఏం జరిగిందంటే..
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ క్రేజీ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో నటించేందుకు హీరో రామ్ పోతినేని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఇటీవలే లింగుస్వామి ఫైనల్ నేరేషన్ ఇచ్చారని, స్క్రిప్ట్ అద్భుతంగా ఉందంటూ రామ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని రామ్ ఎదురుచూస్తున్నాడు.
ఇదీ చదవండి: సోషల్ మీడియా నుంచి వైదొలిగిన కొరటాల శివ.. కారణం అదేనా!
ఇలాంటి తరుణంలో ఈ క్రేజీ కాంబినేషన్ కు అడ్డంకులు ఎదురయ్యేలా ఉన్నాయి. లింగుస్వామిపై ప్రముఖ తమిళ నిర్మాత జ్ఙానవేల్ రాజా తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, సౌత్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఫిర్యాదు నమోదు చేశారు.
లింగుస్వామి గతంలో తమ బ్యానర్ లో సినిమా చేసేందుకు చాలా మొత్తంలో డబ్బు తీసుకున్నారని ఆరోపించారు. ఇంతవరకు ఆయన తన ప్రామిస్ నిలబెట్టులోలేదు. సినిమా చేసేందుకు తమ మధ్య ఒప్పందం జరిగింది. కానీ ఇంతవరకు లింగుస్వామి తన ప్లాన్ తో ముందుకు రాలేదు. డబ్బు కూడా తిరిగి చెల్లించడం లేదు అని జ్ఞానవేల్ రాజా ఆరోపించారు.
హీరో రామ్ తో లింగుస్వామి సినిమా చేసుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అంతకంటే ముందు మాతో సినిమా చేయాలి లేదా ఇష్యూ సెటిల్ చేయాలి. అంతవరకు ఆయన మరో ప్రాజెక్ట్ చేయకూడదు అని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆయన ఇక్కడ మెంబర్ కాదు కనుక చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని తెలుగు ఫిలిం ఛాంబర్ జ్ఞానవేల్ రాజాకు తెలిపినట్లు తెలుస్తోంది. సౌత్ ఫిలిం ఛాంబర్, తమిళ్ ఫిలిం ఛాంబర్ కు ఈ వ్యవహారం వదిలేస్తున్నామని తెలిపారు. ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.
రామ్, లింగుస్వామి కాంబోలో చిత్రానికి ఇటీవలే ప్రకటన వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీనివాస చిత్తూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments