'2.0' పై సెన్సార్ బోర్డుకు పిర్యాదు
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్, అక్షయ్‌కుమార్, శంకర్ కాంబినేషన్లో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన విజువల్ వండర్ '2.0'. ఇండియన్ సినిమాల్లో భారీ బడ్జెట్ చిత్రంగా రూ.550 కోట్లతో సినిమా తెరకెక్కింది. రేపు సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇలాంటి సందర్భంలో ఈ సినిమాపై ఓ వివాదం రేగింది. సాధారణంగా ఈ మధ్య సినిమాలకు వివాదాలకు కామన్ అయినా కథ పరంగానో.. రెమ్యునరేషన్స్ పరంగానో ఈ వివాదాలు ఉంటుంటాయి.
కానీ '2.0' విషయానికి వస్తే సెల్యులార్స్ ఆపరేటర్స్ ఆసోషియేషన్ ఆఫ్ ఇండియా (కాయ్) ఈ సినిమాపై సెన్సార్ బోర్డుకు పిర్యాదు చేసింది. సెల్‌ఫోన్ వాడకం ప్రమాదకరమంటూ ఈ సినిమాలో చూపించబోతున్నారని.. అయితే సెల్‌ఫోన్ వాడకం వల్ల పర్యావరణానికి ఎక్కడా ఇబ్బంది ఉన్నట్లు నిరూపణ కాలేదని.. అలాంటి సందర్భంలో '2.0' లో చూపించే మెయిన్ కథాంశం తమకు వ్యతిరేకంగా ఉందని కాయ్ పేర్కొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments