సమంతకి ఆ పోరు తప్పట్లేదు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు, తమిళ భాషల్లో ఫుల్‌ఫామ్‌లో ఉంది సమంత. ఈ నెలాఖరులో రిలీజ్‌కి సిద్ధమైన విక్రమ్ '10 ఎండ్రతుకుల్ల'తో కలుపుకుని ఆమె చేతిలో ఎనిమిది చిత్రాల వరకు ఉన్నాయి. విశేషమేమిటంటే.. వీటిలో ఒకట్రెండు సినిమాలను మినహాయిస్తే.. మిగిలిన అన్ని చిత్రాలలోనూ సమంతకి మరో హీరోయిన్‌తో పోరు తప్పట్లేదు. చేతిలో ఉన్న రెండు తెలుగు చిత్రాల్లో.. 'బ్రహ్మోత్సవం' కోసం కాజల్, ప్రణీతలతో తెరను పంచుకుంటున్న సమంత.
మరో సినిమా 'అ..ఆ..' కోసం అనుపమ పరమేశ్వరన్తో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. ఇక తమిళంలో విజయ్ 59వ చిత్రంలోనూ, అలాగే ధనుష్ పక్కన నటిస్తున్న విఐపి 2లోనూ అమీ జాక్సన్‌తో కలిసి నటిస్తోంది. అలాగే సూర్య '24' సినిమా కోసం నిత్యా మీనన్‌తో మరోసారి కలిసి నటిస్తోంది. ఇక 'బెంగుళూరు డేస్' తమిళ రీమేక్‌లో సమంతది గెస్ట్ రోల్ అయితే.. అందులో మరో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. మొత్తమ్మీద.. ఎంత స్టార్ హీరోయిన్ అయినా.. కథ డిమాండ్ మేరకో.. లేక గ్లామర్ డిమాండ్ మేరకో సమంతకి మరో హీరోయిన్‌తో కచ్చితంగా తెరను పంచుకోవాల్సిన పరిస్థితి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments