చెర్రీ , బన్నిల పోటాపోటీ
Send us your feedback to audioarticles@vaarta.com
'ఎవడు' కోసం కలిసి నటించి మెగా అభిమానులను అలరించారు మెగా ఫ్యామిలీ హీరోలైన రామ్‌చరణ్, అల్లు అర్జున్. ఆ సినిమాలో వారిద్దరి మధ్య సన్నివేశాలేమీ లేకపోయినా.. ఓ సీన్‌లో స్క్రీన్‌పై ఇద్దరూ ఒకే చోట కనిపించడమే పెద్ద మల్టీస్టారర్ చిత్రంలా ఫీలయిపోయి మంచి విజయాన్నే కట్టబట్టారు. అలాంటి చెర్రీ, బన్నిలిద్దరూ పోటాపోటీగా పలకరిస్తే.. మెగా ఫ్యాన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో? ఇలాంటి సందర్భమే ఒకటి ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది.
కాకపోతే.. అది తెలుగునాట ఎదురయ్యే పరిస్థితి అయితే కాదు. తమిళంలో రిలీజ్ కానున్న తమిళ వెర్షన్‌ల విషయంలోనే. బన్ని గోనగన్నారెడ్డిగా కనిపించనున్న 'రుద్రమదేవి' ఈ నెల 9న విడుదల కానుండగా.. తమిళ వెర్షన్ మాత్రం 16న రిలీజ్ కానుంది. ఇక చెర్రీ కొత్త చిత్రం 'బ్రూస్‌లీ' ఇక్కడ 16న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. తమిళంలోనూ 'బ్రూస్‌లీ 2' పేరుతో అదే రోజున డబ్ కానుంది. మరి చెర్రీ, బన్నిలలో ఎవరికి తమిళతంబీలు కాసుల వర్షాన్ని కురిపిస్తారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com