'ఇంద్ర', 'అజ్ఞాతవాసి'.. కొన్ని కామన్ పాయింట్స్
Send us your feedback to audioarticles@vaarta.com
కొన్ని విషయాలు యాదృచ్ఛికంగా జరిగినా భలే సరదాగా, గమ్మత్తుగా ఉంటాయి. ఒకవేళ ఆ విషయాలు సినిమాలకు సంబంధించినవైతే.. అవి ఇంకా ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఇలాంటి ఓ యాదృచ్ఛిక విషయం మెగా సోదరుల మధ్య జరిగితే ఇంకెంత ఆసక్తి ఉంటుంది? సరిగ్గా ఇలాంటి విషయమే వారి సినిమాల్లో జరిగింది. అవే చిరంజీవి నటించిన చూడాలని ఉంది`, పవన్ కల్యాణ్ నటించిన ఖుషి` సినిమాలు. నిశితంగా పరిశీలిస్తే ఈ రెండు సినిమాలు కూడా కలకత్తా నేపథ్యంలో తెరకెక్కినవే. రెండూ సూపర్ హిట్ మూవీలే. మళ్ళీ ఇలాంటి విషయాలే పవన్ నటించిన అజ్ఞాతవాసి` విషయంలో పునరావృతం కానున్నాయి.
16 ఏళ్ల క్రితం చిరు నటించిన ఇంద్ర`, ఇప్పుడు పవన్ నటించిన అజ్ఞాతవాసి`.. రెండూ కూడా వారణాసి నేపథ్యంలో రూపుదిద్దుకున్నాయి. ఇంద్ర` వైజయంతి మూవీస్ సంస్థకి సిల్వర్ జూబిలీ ఇయర్ ఫిలిం.. బి.గోపాల్, చిరంజీవి కాంబినేషన్లో 3వ సినిమా. అలాగే అజ్ఞాతవాసి` పవన్ కి సిల్వర్ జూబిలీ సినిమా కాగా.. అలాగే త్రివిక్రమ్, పవన్ కలయికలో 3వ చిత్రం. ఈ రెండు సినిమాలలో కూడా ఇద్దరు కథానాయికలు...అలాగే ఆయా హీరోలతో మొదటి సారిగా నటించారు. ఇక ఈ రెండు చిత్రాలకి ఎడిటరుగా కోటగిరి వెంకటేశ్వర రావు పనిచేసారు. ఇంద్ర`లో గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం అతిథి పాత్రలో మెరవగా.. విక్టరీ వెంకటేష్ అజ్ఞాతవాసి`లో అతిథి పాత్రతో సందడి చేయనున్నారు. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే...అజ్ఞాతవాసి` సినిమాకి వాడిన ట్యాగ్ లైన్ ప్రిన్స్ ఇన్ ఎక్సైల్` ఈ రెండు సినిమాలకి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే.. రెండు సినిమాల్లోనూ హీరో అజ్ఞాతంలో ఉండే వాతావరణం ఉంటుంది. ఇన్ని అంశాలు కలగలసిన ఈ రెండు సినిమాల్లో ఇంద్ర` చిరంజీవి కెరీర్లో బ్లాక్ బస్టర్ గా, ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిపోయింది. మరి అజ్ఞాతవాసి` పవన్‌కి ఏ రేంజ్ లో ప్లస్ అవుతుందో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments