కామన్ మేన్ ని హీరో చేసే.. కొరియర్ బాయ్ కళ్యాణ్ : నితిన్
Send us your feedback to audioarticles@vaarta.com
నితిన్, యామి గౌతమ్ జంటగా గౌతమ్ మీనన్ నిర్మించిన చిత్రం కొరియర్ బాయ్ కళ్యాణ్. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు ప్రేమ సాయి తెరకెక్కించారు. వినాయక చవితి సందర్భంగా ఈ నెల 17న కొరియర్ బాయ్ కళ్యాణ్ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా కొరియర్ బాయ్ కళ్యాణ్ గురించి హీరో నితిన్ ఇంటర్ వ్యూ మీకోసం...
కొరియర్ బాయ్ కళ్యాణ్ కాన్సెప్ట్ ఏమిటి..?
కాన్సెప్ట్ ఏమిటనేది మాత్రం చెప్పలేను. కానీ ఖచ్చితంగా కొత్తగా ఉంటుంది. షాకింగ్ గా ఉంటుంది. కథ విన్నప్పుడు థ్రిల్ ఫీలయ్యాను. నేను ఇప్పటి వరకు లవ్ & యాక్షన్ మూవీస్ చేసాను. కానీ ఈ తరహా మూవీ చేయలేదు. నేను ఫీలయినట్టే ఆడియోన్స్ కూడా ఫీలైతే మంచి సినిమా అవుతుంది.
కొత్త కాన్సెప్ట్ అంటున్నారు..రిస్క్ ఏమో అనిపించలేదా..?
కథ విన్నప్పుడు రిస్క్ అనిపించలేదు. కానీ ఇప్పుడు ఆడియోన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయమేస్తుంది.. ఎందుకంటే కమర్షియల్ సినిమాలే హిట్ అవుతున్నాయి. కొత్తగా ట్రై చేసామ్ ఎలా ఉంటుందో అని టెన్షన్. అయితే ఇటీవల వరుసగా అన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి దాంతో మా సినిమా కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సినిమా విజయం సాధిస్తే..కొత్త సినిమాలు మరిన్ని ట్రై చేయచ్చు.
నిర్మాత గౌతమ్ మీనన్ గురించి..?
సినిమా రెండు, మూడు సంవత్సరాలు లేట్ అయినా కూడా...గౌతమ్ మీనన్ ఎక్కడా చుట్టేయకుండా చాలా రిచ్ గా తీసారు. మూమూలుగా సినిమా డిలే అవుతుంటే త్వరగా చేయలని చుట్టేస్తారు.కానీ గౌతమ్ మీనన్ గారు అలా చేయలేదు. సినిమాని నమ్మి ఖర్చు వెనకాడకుండా తీసారు. సినిమా చాలా ఫ్రెష్ గా ఉంటుంది.
డైరెక్టర్ ప్రేమ సాయి గురించి..?
కొంత మంది కథ బాగా చెబుతారు... కొంత మంది కథ చెప్పలేక పోయనా బాగా తీస్తారు. కానీ ప్రేమ సాయి బాగా చెప్పాడు..బాగా తీసాడు. ఫస్ట్ డే ఫస్ట్ షాట్ నుంచే అర్థమైంది ప్రేమ సాయి గురించి. ఖచ్చితంగా మంచి డైరెక్టర్ గా పేరు వస్తంది.
నితిన్ అంటే లవర్ బాయ్ ఇమేజ్..ఈ సినిమాతో మీకు కొత్త ఇమేజ్ వస్తుందా..?
ఇదొక కొత్త ఫార్మెట్ సినిమా. రెగ్యులర్ కమర్షియల్ సినిమానే. కాకపోతే లవ్ స్టోరీ, హీరోయిజం, కామెడీ అంతా కొత్తగా ఉంటుంది. జయం సినిమాలో సాఫ్ట్ క్యారెక్టర్ సమస్యల్లో ఇరుక్కుని క్లైమాక్స్ కి ఎలా హీరో అవుతాడో.. ఇందులో కూడా కామన్ మేన్ ఎలా హీరో అయ్యాడనేది కొత్తగా ఉంటుంది. దీంతో నాకు కొత్త ఇమేజ్ అంటూ రాదు కానీ.. ఇలాంటి కొత్త సినిమా మరొకటి చేయడానికి ధైర్యం వస్తుంది.
కొరియర్ బాయ్ కళ్యాణ్ అని పేరు మీరే పెట్టారా..?
ఇక్కడ మీకు ఓ విషయం చెప్పాలి. త్రివిక్రమ్ గారితో చేస్తున్న సినిమాకి టైటిల్ అ..ఆ అని పెట్టాం. దీని గురించి వెబ్ సైట్ లో ఎక్కడో చదివాను..కళ్యాణ్ గారు అ..ఆ అంటారు కదా..అదే నితిన్ కొత్త సినిమాకి టైటిల్ గా పెట్టారని రాసారు. ఇలా..ఏ టైటిల్ పెట్టినా కళ్యాణ్ గారితో లింక్ అవుతుంది. ఈ సినిమా టైటిల్ విషయానికి వస్తే... డైరెక్టర్ ప్రేమ సాయి కొరియర్ బాయ్ కార్తీక్, కొరియర్ బాయ్ కళ్యాణ్ ఈ రెండు టైటిల్స్ లో ఏది బాగుందని నన్ను అడిగారు. రెండు బాగానే ఉన్నాయి. మీరే ఏదో ఒకటి ఫైనల్ చేయండి అంటే కొరియర్ బాయ్ కళ్యాణ్ అని ఫైనల్ చేసారు. ఓకే.. కళ్యాణ్ పేరు రావడం సెంటిమెంట్ బాగానే ఉందని ఓకె అన్నాను.
కొత్త పాయంట్ అంటున్నారు..జరిగిన కథా..?
అవును...నిజంగా జరిగిన కథ ఇది. ఈ మధ్య ఇండియాలో కూడా స్టార్ట్ అయ్యింది. ఈ సంఘటన బొంబాయిలో జరిగింది. సినిమా చూసాక ఈ పాయింట్ గురించి నెట్ లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది.ఇంతకు మించి ఆ పాయింట్ గురించి ఏమీ చెప్పలేను.
ఈ మూవీ తమిళ్ లో కూడా చేస్తున్నారు. కదా.. తమిళ్ లో మీరే చేయచ్చుగా..?
ఈ సినిమా ఫస్ట్ తమిళ్ లో ఓకె అయ్యింది. హీరో జై తమిళ్ లో చేస్తున్నారు. ఆ తర్వాత తెలుగులో ఇద్దరు, ముగ్గురు హీరోలకు చెప్పారు కానీ ఎందుకనో చేయలేదు. ఆ తర్వాత నా దగ్గరికి వచ్చింది. కథ నచ్చి నేను చేసాను.సినిమాను వదలుకుని వాళ్లు చేసింది కరెక్టో...లేక సినిమా చేసి నేను కరెక్టో చూడాలి.
ఈ సినిమా బాగా లేట్ అయ్యింది కారణం..?
ఈ సినిమా 2012లో స్టార్ట్ అయ్యింది. తమిళ్ లో కొన్ని కారణాల వలన లేట్ అయ్యింది. తెలుగు వెర్షన్ సంవత్సరం క్రితమే పూర్తి అయ్యింది. షూటింగ్ , డబ్బింగ్ అన్ని సంవత్సరం క్రితమే అయిపోయాయి. సినిమా లేట్ అయితే ఆ పాయింట్ తో సినిమాలు వచ్చేయడం జరుగుతుంది. కానీ ఈ పాయింట్ తో సినిమా ఇంకా రాలేదు. ఈ సినిమా మూడు సంవత్సరాలు క్రితం వచ్చుంటే ఎవరికి అర్ధం కాకపోయి ఉండవచ్చు. ఈ సినిమాలో మేము చెబుతున్న పాయింట్ ఇప్పుడు బాగా ఫేమస్ అయింది. ఇప్పుడు అందరికి అర్ధం అవుతుంది. సో...అది మాకు ప్లస్ పాయింట్.
సినిమా లేట్ అయినప్పుడు మీకు ఏమినిపించింది..?
కొత్త పాయింట్ తో తీసిన మంచి సినిమా. ఇష్టపడి చేసిన సినిమా...ఇంకా రిలీజ్ కావడం లేదని ఫీలయ్యాను. మన చేతిలో ఏమి లేదు. అంతా దేవుని స్ర్కీన్ ప్లే అనుకున్నాను. పైగా నా గత సినిమా డిసెంబర్ లో రిలీజ్ అయ్యింది. త్రివిక్రమ్ గారితో చేసే సినిమా వచ్చే సంవత్సరం జనవరిలో రిలీజ్ అవుతుంది. అంటే సంవత్సరం గ్యాప్. ఈ గ్యాప్ లో ఈ సినిమా రావడం హ్యాపీ. కొరియర్ బాయ్ కళ్యాణ్ లేట్ అవ్వడం చూస్తుంటే ఏది జరిగినా.. అంతా మన మంచికే అనిపిస్తుంది.
అఖిల్ సినిమా సాంగ్స్ లీక్ అవుతున్నాయా..? మీరే లీక్ చేస్తున్నారా..?
అఖిల్ సినిమాకి ఆల్రెడీ చాలా హైప్ ఉంది. ఇంకా ఏదో చేసేసి హైప్ చేయాలని లేదు. విషయం ఏమిటంటే... అఖిల్ సినిమా స్పైయిన్ లో షూటింగ్ జరుగుతుంది. అక్కడ మన ఇండియన్స్ షూట్ చేసి వెబ్ సైట్స్ లో పెడుతున్నారు. దానిని అఖిల్ ఫ్యాన్స్ తీసి మన వెబ్ సైట్స్ లో పెడుతున్నారు.ఆ విధంగా అఖిల్ సినిమా సాంగ్స్ లీక్ అయ్యాయి తప్ప మేము కావాలని లీక్ చేయలేదు.
అఖిల్ సినిమాతో నిర్మాతగా మారారు కదా..ఎలా ఉంది..?
నిర్మాతగా చేయడం చాలా కష్టం. ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని చూసుకోవాలంటే మామూలు విషయం కాదు. నినాయక్ గారు కాబట్టి ఇంత భారీ చిత్రాన్ని చాలా కూల్ గా..చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు.
అఖిల్ సినిమా బడ్జెట్ పెరిగింది అంటున్నారు...కారణం..?
అఖిల్ సినిమాకి బడ్జెట్ ముందు నుంచి అనుకున్నదే తప్ప ఆఖరి నిమిషంలో పెరిగింది కాదు. బడ్జెట్ కి తగ్గట్టే బిజినెస్ అయింది కాబట్టి హ్యాపీ.100 కాన్మిడెంట్ గా ఉన్నాం. ఇది భారీ సినిమా కాదు. భారీ స్టోరి ఉన్న సినిమా.
తమిళ్ లో సినిమాలు చేసే ఆలోచన ఉందా..?
జనవరిలో గౌతమ్ మీనన్ తో సినిమా చేస్తున్నాను. ఈ సినిమా తెలుగు, తమిళ్ లో చేస్తాను.
విక్రమ్ కుమార్ 24 సినిమా తెలుగు రైట్స్ భారీ రేటుకు తీసుకున్నట్టున్నారు..?
తెలుగు రైట్స్ కి ఎంత రేట్ ఇచ్చి తీసుకున్నాను అనేది చెప్పను కానీ...ఖచ్చితంగా మంచి సినిమా అవుతుందని చెప్పగలను. ఈ సినిమా స్టోరీ ఇష్క్ టైం లోనే చెప్పారు. నాకు బాగా నచ్చింది. కాకపోతే ఈ సినిమా లో హీరో త్రిబుల్ రోల్. మూడు పాత్రలు చేయాలంటే ఏజ్ ఉండాలి అని నేను చేయలేదు. ఏజ్ ఉండి ఉంటే నేనే చేసేవాడిని. కథ మీద ఉన్న నమ్మకంతోనే ఎక్కువ రేటుకు రైట్స్ తీసుకున్నాను.
నిర్మాతగా కంటిన్యూ అవుతారా..?
మళ్లీ అఖిల్ టైమ్ ఇస్తే అపుడు చేస్తాను.తప్ప ఇప్పట్లో నిర్మాతగా సినిమా చేసే ఉద్దేశ్యం లేదు.
అఖిల్, బ్రూస్ లీ సినిమాలు వారం గ్యాప్ లో రిలీజ్ అవుతున్నాయి. ప్రాబ్లమ్ కాదా..?
రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే ప్రాబ్ల్. వారం గ్యాప్ ఉంది.. పైగా హాలీడేస్ కాబట్టి కాబట్టి నో ప్రాబ్లమ్.
త్రివిక్రమ్ చేస్తున్న సినిమా గురించి..?
రెగ్యూలర్ కమర్షియల్ సినిమా. త్రివిక్రమ్ గారి స్టైయిల్ లో ఉండే సినిమా. ఈ నెలలో షూటింగ్ ప్రారంభించి జనవరిలో రిలీజ్ చేస్తాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com