Committite Kurrollu:‘కమిటీ కుర్రోళ్ళు’ నుంచి ‘ప్రేమ గారడీ..’ అనే లిరికల్ సాంగ్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
‘అమ్మాయికి మనసులోని ప్రేమను చెప్పాలంటే, ఆమె ఆ ప్రేమకు వెంటనే ఎస్ చెప్పాలంటే సాధారణ విషయం కాదు.. మరీ పుట్టిన పెరిగిన పల్లెటూర్లో అయితే ఎవరెక్కడ చూస్తారోనని అమ్మాయి, అబ్బాయి ప్రేమ ఊసులు చెప్పుకోవటం మరీ కష్టం. అలాంటి కష్టాన్ని హాయిగా అనుభవిస్తోన్న కుర్రాడు మనసులోని ‘ప్రేమ గారడీ..’ని నచ్చిన అమ్మాయికి ఎలా చెప్పాడనేది తెలుసుకోవాలంటే విడుదలకు సిద్ధమవుతోన్న ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్.
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతోన్నఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. పక్కా ప్లానింగ్‌తో మేకర్స్ అనుకున్న సమయానికి కన్నా ముందే సినిమా షూటింగ్‌ను పూర్తి చేయటం విశేషం. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ బుధవారం ఈ సినిమా నుంచి ‘ప్రేమ గారడీ..’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు.
అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తోన్న ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంలోని ‘ప్రేమ గారడీ..’ పాటను కిట్టు విస్సాప్రగడ రాయగా అర్మాన్ మాలిక్ పాడారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుంది. రీసెంట్‌గా రిలీజైన ‘గొర్రెలా..’ అంటూ పాటకు, టీజర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. రాజు ఎడురోలు ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
నటీనటులు : సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు,త్రినాద్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, రాధ్య, తేజస్వి రావు, టీనా శ్రావ్య,విషిక, షణ్ముకి నాగుమంత్రి ..ముఖ్య పాత్రల్లో సాయి కుమార్ ,గోపరాజు రమణ,బలగం జయరాం,శ్రీ లక్ష్మి ,కంచెరపాలెం కిషోర్ ,కిట్టయ్య ,రమణ భార్గవ్,జబర్దస్త్ సత్తిపండు తదితరులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments