భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర, ఏకంగా రూ.250 పెంపు, కొత్త రేట్లు ఇవే

  • IndiaGlitz, [Friday,April 01 2022]

ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి సామాన్యుల నడ్డి విరిచింది కేంద్ర సర్కార్ . దీనిపై దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆందోళనలకు సైతం సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో చమురు కంపెనీలు మరోసారి వాణిజ్య అవసరాల కోసం వాడే సిలిండర్‌ ధరను భారీగా పెంచాయి. ఏకంగా రూ.250 పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో హైదరాబాద్‌‌లో 19 కిలోల కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.2,460 కి చేరింది. ఢిల్లీ రూ.2,253, కోల్‌కతాలో రూ.2351, ముంబయిలో రూ.2205, చెన్నైలో రూ.2406కి చేరింది.

చేరింది. అయితే గృహ అవసరాలకోసం వాడే 14 కిలోల డొమెస్టిక్ సిలిండర్‌ ధరలో ఎలాంటి మార్పు లేదు. దాని ధరను కొద్దిరోజుల క్రితమే చమురు కంపెనీలు పెంచిన సంగతి తెలిసిందే. వాణిజ్య సిలిండర్ల ధరల పెరుగుదలతో పాటు, విమాన ఇంధన ధరలు కూడా పెరిగాయి. ఏప్రిల్ 1న జెట్ ఇంధనం ధర 2 శాతం పెరిగి కిలోలీటర్ ధర 1,12,925 కు చేరింది. గతంలో దీని ధర రూ.1,10,666గా ఉండేది. పెరిగిన రేట్లు 15 ఏప్రిల్ 2022 నుండి వర్తించనున్నాయి. గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం నేటి నుంచే అమల్లోకి రానున్నాయి.

మరోవైపు ఇంధన ధరలతో వినియోగదారులపై మోయలేని భారం పెరుగుతుండగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం కాసుల వర్షం కురుస్తోంది. మార్చి 22 నుంచి 10 రోజుల్లో 9 సార్లు పెట్రోలు, డీజిల్ ధరను పెంచాయి. చమురు సంస్ధలు రోజూ సగటున 80 పైసలకు పైనే ధరలను పెంచుతున్నాయి.

More News

టాలీవుడ్‌లో విషాదం .. క్యాన్సర్‌తో డైరెక్టర్ శరత్ కన్నుమూత

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో దర్శకుడు శంకర్ కన్నుమూశారు.

500 తల్లిబిడ్డా ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించిన సీఎం జగన్.. బెజవాడలో పరుగులు

విజయవాడలోని బెంజిస‌ర్కిల్ వ‌ద్ద శుక్రవారం త‌ల్లి బిడ్డా ఎక్స్ ప్రెస్ వాహ‌నాల‌ను ఏపీ సీఎం వైఎస్ జగన్ జెండా ఊపి ప్రారంభించారు.

ఆర్ఆర్ఆర్ యూనిట్‌పై ఆగ్రహం.. స్పందించిన అలియా, సింగిల్‌ పోస్ట్‌తో అందరికీ ఇచ్చిపడేసిందిగా

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన చిత్రం ‘‘ఆర్ఆర్ఆర్’’.

నాగార్జున చేతుల మీదుగా విడులైన సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘గాలివాన’ ట్రైలర్‌

పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ నుండి కామెడీ డ్రామా ‘‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’’ మరియు అన్నపూర్ణ స్టూడియోస్‌ నుండి ‘‘లూజర్‌’’

హైదరాబాదీలకు బంపరాఫర్.. రూ.59తో మెట్రోలో రోజంతా ప్రయాణం, కానీ..?

ప్రజలను ట్రాఫిక్ కష్టాలకు దూరంగా, సుఖమయ, సురక్షిత ప్రయాణాన్ని అందిస్తోన్న హైదరాబాద్‌ మెట్రో ప్రజల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంటోంది.