భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర, ఏకంగా రూ.250 పెంపు, కొత్త రేట్లు ఇవే
Send us your feedback to audioarticles@vaarta.com
ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి సామాన్యుల నడ్డి విరిచింది కేంద్ర సర్కార్ . దీనిపై దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆందోళనలకు సైతం సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో చమురు కంపెనీలు మరోసారి వాణిజ్య అవసరాల కోసం వాడే సిలిండర్ ధరను భారీగా పెంచాయి. ఏకంగా రూ.250 పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో హైదరాబాద్లో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.2,460 కి చేరింది. ఢిల్లీ రూ.2,253, కోల్కతాలో రూ.2351, ముంబయిలో రూ.2205, చెన్నైలో రూ.2406కి చేరింది.
చేరింది. అయితే గృహ అవసరాలకోసం వాడే 14 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. దాని ధరను కొద్దిరోజుల క్రితమే చమురు కంపెనీలు పెంచిన సంగతి తెలిసిందే. వాణిజ్య సిలిండర్ల ధరల పెరుగుదలతో పాటు, విమాన ఇంధన ధరలు కూడా పెరిగాయి. ఏప్రిల్ 1న జెట్ ఇంధనం ధర 2 శాతం పెరిగి కిలోలీటర్ ధర 1,12,925 కు చేరింది. గతంలో దీని ధర రూ.1,10,666గా ఉండేది. పెరిగిన రేట్లు 15 ఏప్రిల్ 2022 నుండి వర్తించనున్నాయి. గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం నేటి నుంచే అమల్లోకి రానున్నాయి.
మరోవైపు ఇంధన ధరలతో వినియోగదారులపై మోయలేని భారం పెరుగుతుండగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం కాసుల వర్షం కురుస్తోంది. మార్చి 22 నుంచి 10 రోజుల్లో 9 సార్లు పెట్రోలు, డీజిల్ ధరను పెంచాయి. చమురు సంస్ధలు రోజూ సగటున 80 పైసలకు పైనే ధరలను పెంచుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout