కమర్షియల్ కమల్...
Send us your feedback to audioarticles@vaarta.com
తనదైన నటనతో ఎన్నో విలక్షణ పాత్రల్లో నటించిన కమల్ హాసన్ సోషల్ అవెర్ నెస్ కలిగించే యాడ్స్ లో తప్ప ఐదు దశాబ్దాల నట జీవితంలో ఎన్నడూ కమర్షియల్ యాడ్ లో కనపడలేదు. అయితే త్వరలోనే కమల్ హాసన్ ఓ కమర్షియల్ యాడ్ లో కనిపించనున్నాడని విశ్వసనీయవర్గాల సమాచారం.
ప్రముఖ టెక్స్ టైల్ కంపెనీ పోతీస్ వారు చేయనున్న యాడ్ లో కమల్ నటించనున్నారట. ఈ యాడ్ ను ప్రముఖ తమిళనటుడు కృష్ణ వచ్చేవారంలో డైరెక్ట్ చేస్తున్నాడని టాక్. ఎప్పుడూ యాడ్స్ గురించి ఆలోచించని కమల్ హాసన్ ఇప్పుడెందుకు ఆలోచిస్తున్నాడని కూడా ఫిలింవర్గాలు ఆలోచనలో పడ్డాయి. ప్రస్తుతం కమల్ హాసన్ చీకటిరాజ్యం` సినిమాతో మన ముందుకు రానున్నారు. త్రిష, ప్రకాష్ రాజ్ ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాజేష్ ఎం.సెల్వ దర్శకుడు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com