మహేష్ అభినందనల పై కామెంట్స్...
- IndiaGlitz, [Saturday,April 29 2017]
సూపర్‌స్టార్ మహేష్ కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు వచ్చిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు సందర్భంగా ఆయనకు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడే అసలు రచ్చ ప్రారంభమైంది. చాలా మంది హీరోలు విశ్వనాథ్‌ను ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలిపారు. మరికొందరు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మహేష్ కూడా రెండో విధానంలోనే విషెష్ చెప్పాడు.
అయితే అవార్డు వచ్చిన నాలుగురోజుల తర్వాత మహేష్ తన విషెష్ చెప్పడం కొందరిని బాధించిందేమో వారు కౌంటర్స్ వేసేస్తున్నారు. అవార్డు వచ్చిన నాలుగురోజుల తర్వాత మెసేజ్ పెట్టడమేంటి, ముందుగానే పెట్టవచ్చుగా, ఎలాగూ సినిమాలు లేట్‌గానే చేస్తున్నారు. విషెష్ కూడా లేటయితే ఎలా అని అంటున్నారు.