లగడపాటీ.. వచ్చేది వైసీపీ ప్రభుత్వమే.. అండర్ గ్రౌండ్‌లో దాక్కో!

  • IndiaGlitz, [Monday,May 20 2019]

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో మహాకూటమి గెలుస్తుందని చిలకజోస్యం చెప్పిన మాజీ ఎంపీ, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్.. అది కాస్త అట్టర్ ప్లాప్ అవ్వడంతో ఆయన అడ్రస్ గల్లతైంది.!. అయితే త్వరలో ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడనుండటంతో ఏపీలోనూ తాను జోస్యం చెబుతానంటూ వచ్చి టీడీపీ గెలుస్తుందని చిలకపలుకులు చెప్పేశారు. తెలంగాణలో అట్టర్ ప్లాప్ అయిన లగడపాటి సర్వేను నమ్మే జనాలు ఇప్పుడున్నారా..? అసలు ఆయన చేసింది కూడా ఒక సర్వేనేనా..? అంటూ ఆంధ్రా ప్రజలు, పలువురు విశ్లేషకులు, క్రిటిక్స్, నెటిజన్లు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోస్తున్నారు. తాజాగా రాజగోపాల్ సర్వేపై ప్రముఖ సినీ రచయిత, వైసీపీ నేత చిన్నికృష్ణ స్పందించారు.

నీ కుటుంబపై సర్వే చేసుకో!

సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన.. సర్వేల పేరుతో హడావిడి చేసే లగడపాటి ఫలితాల తర్వాత అండర్ గ్రౌండ్‌లో దాక్కోవడం ఖాయమన్నారు. ఎందుకైనా మంచిది లగడపాటి ముందుగానే ప్రభుత్వాన్ని అడిగి సెక్యూరిటీ పెట్టుకుంటే మంచిదని చిన్నికృష్ణ సూచించారు. ఎన్నికల సర్వేలు చేసే రాజగోపాల్ ముందు తన కుటుంబంపై ఓ సర్వే చేసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. సర్వేలు చదివేప్పుడు.. మేం సైంటిఫిక్‌గా చెబుతున్నాము.. ఇది మేం తొంగి చూసి చెప్పింది కాదు.. మీరేం అనుకోవద్దని లగడపాటి చెప్పడం విడ్డూరంగా ఉందని చిన్నికృష్ణ సెటైర్లేశారు. పెద్ద ఇంటిలిజెంట్‌లా మాట్లాడుతున్న రాజగోపాల్.. ముందు తన కుటుంబంపై సర్వే చేయించుకోవాలని.. సినిమాలు ఎలా తీయాలో లగడపాటి తన తమ్ముడికి నేర్పించమని చిన్నికృష్ణ హితవు పలికారు.

వైసీపీ గెలుస్తుంది..!

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేది వైసీపీ ప్రభుత్వమే. వైఎస్ జగన్‌మోహన్‌‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయం. 2024లో కూడా జగన్ ముఖ్యమంత్రి.. వైసీపీ గెలుస్తుందన్నారు. ఇప్పుడు 120 సీట్లు వస్తే అప్పుడు 130 వస్తాయి. ఈ విషయం చెప్పడానికి అంత సమయం అవసరం లేదు. లగడపాటి లాంటి వాళ్ల సర్వేలు నమ్మొద్దు.. అవి నమ్మితే మోసపోయినట్లే అని చిన్నికృష్ణ జోస్యం చెప్పారు.

పబ్లిక్‌లో ఎలా మాట్లాడబుద్దవుద్దో!

వ్యాపారం చేయడం.. బ్యాంకుల్లో మధ్యతరగతి కుటుంబాలు డిపాజిట్ చేస్తే.. బ్యాంకులు మీకు లోన్లు ఇస్తే.. ఆ డబ్బును వాడుకొని ఎగ్గొట్టడానికి స్కెచ్ వేసిన నీ కుటుంబంలో నువ్వు సర్వే చేసుకో. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కాబోతున్నారు. ఆయన మళ్లీ అధికారంలోకి రాగానే బ్యాంకుల్ని మోసం చేసినవారి పాస్‌పోర్ట్ సీజ్ చేసి.. హౌస్ అరెస్ట్ చేసి.. మరీ డబ్బు కట్టించాలి. ఈ నెల 23 వరకు వేచి చూడాలి. ఒక నెలలో అలాంటి వారంతా జైలుకెళ్లడం ఖాయం. ఇలాంటి దగుల్భాజీల వల్ల రాష్ట్ర ఖజానా, దేశ భవిష్యత్ నాశనం అవుతుంది. కొత్త చట్టాలు తెచ్చి నాన్ బెయిల్‌బుల్ కింద అరెస్ట్ చేయాలి. ఇలాంటి వారు పబ్లిక్‌లో ఎలా మాట్లాడబుద్ధి అవుతుందో అర్ధం కావడం లేదున్నారు.

కాగా.. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సైతం చిన్నికృష్ణ తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీపై విమర్శలు గుప్పించినట్లు ఆయన దృష్టికెళితే చాలు మరుసటి నిమిషమే ప్రెస్‌మీట్ దుమ్ముదులిపి వదులుతుంటారు. ఎన్నికల ప్రచారంలో బిజీబీజీగా ఉన్న వైఎస్ జగన్‌ను కలిసి ఆయన సమక్షంలోనే చిన్నికృష్ణ వైసీపీ కండువా కప్పుకున్నారు. సో.. ఎన్నికల ఫలితాల విషయానికొస్తే ఎవరు సీఎం అవుతారో.. ఎవరు ప్రధాన ప్రతిపక్షనేతగా మిగిలిపోతారో..? అనేది తెలియాలంటే మే-23 వరకు వేచి చూడాల్సిందే మరి.

More News

క్రైౖమ్‌ థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన 'కిల్లర్'  ట్రైలర్ విడుదల..!!

విజయ్ ఆంటోనీ, యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రల్లో న‌టించిన తాజా తమిళ చిత్రం 'కొలైగార‌న్'. ఆండ్రూ లూయిస్ దర్శకుడు. అషిమా క‌థానాయిక‌. దియా మూవీస్‌ బ్యానర్

బ్ర‌ద‌ర్స్ సంద‌డి ఒకే నెల‌లో..

ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోల్లో విష్ణు, మ‌నోజ్ ఉండ‌గా మ‌రో వైపు సాయిధ‌ర‌మ్ తోడుగా అత‌ని త‌మ్ముడు వైష్ణ‌వ్‌తేజ్ కూడా చేరబోతున్నాడు.

ఏపీ ఎగ్జిట్ పోల్స్‌ పై జనసేన రియాక్షన్..

దేశ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం పలు ప్రాంతీయ, జాతీయ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు తమ ఫలితాలు వెల్లడించాయి.

తొడగొట్టి చెబుతున్నా తెలుగుదేశందే గెలుపు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే పలు ప్రాంతీయ, జాతీయ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు తమ సర్వేను వెల్లడించాయి. అయితే ఫలితాలు వెల్లడించిన సర్వేల్లో ఒకటి అర మాత్రమే టీడీపీ గెలుస్తుందని

'కౌసల్య కృష్ణమూర్తి.. ది క్రికెటర్‌' షూటింగ్‌ పూర్తి

నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, ఐశ్వర్యా రాజేష్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా