చిరు, కె.సి.ఆర్ల పై కామెంట్స్.. నిర్మాత ఆవేదన..
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి సన్నిహితుడైన నిర్మాత ఠాగూర్ మధు ఈరోజు సోషల్ మీడియా వేదికగా చిరంజీవిపై చేసిన కామెంట్స్‌కు ...'మీ రాజకీయాలు మీరు చేసుకోండి.. క్రమశిక్షణకు మారు పేరైన మెగాస్టార్‌ను ఎందుకు లాగుతారు. మౌనంగా ఉన్న కె.సి.ఆర్ ఊసెందుకు. భావ వ్యక్తీకరణ మాత్రమే కాదు.. భాష కూడా ముఖ్యం అని మరచిపోకండి" అంటూ ట్వీట్ చేశారు.
రాజకీయాల్లో భాగంగా పవన్‌కల్యాణ్‌ను టార్గెట్ చేసుకున్నకొంతమంది రాజకీయ నాయకులు చిరంజీవిని మాటలంటున్నారు. దీనిపై మధు ఇన్ డైరెక్ట్‌గా ప్రస్తావించారు. అలాగే కె.సి.ఆర్ గురించి తన ట్విట్టర్లో ప్రస్తావించారంటే పవన్‌ను ఉద్దేశించే కదా! అని అందరూ అనుకుంటున్నారు. ఏదేమైనా ఠాగూర్ మధు తన అభిప్రాయాన్ని సున్నితంగా వ్యక్తం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments