నన్ను కామెంట్ చేస్తే పట్టించుకోను. కానీ నా ఫ్యామిలీ మెంటర్స్ ని అంటే మాత్రం తట్టుకోలేను : అనసూయ
- IndiaGlitz, [Friday,February 26 2016]
యాంకర్ గా కెరీర్ ప్రారంభించి...అనతి కాలంలోనే బాగా పాపులర్ అయిన యాంకర్ అనసూయ. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో బుల్లితెర నుంచి వెండితెరకు ప్రమోట్ అయిన అనుసూయ తాజాగా క్షణం సినిమాలో నటించింది. నూతన దర్శకుడు రవికాంత్ దర్శకత్వంలో పి.వి.పి సంస్థ నిర్మించిన క్షణం సినిమా ఈరోజు రిలీజై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా యాంకర్ టర్నడ్ యాక్టరస్ అనసూయ తో ఇంటర్ వ్యూ మీకోసం...
మీరు నటించిన ఫస్ట్ ఫిలిమ్ సోగ్గాడే చిన్ని నాయనా సంచలన విజయం సాధించింది..53 కోట్లు షేర్ సాధించింది..ఎలా ఫీలవుతున్నారు...?
అసలు..నేను నటించిన ఫస్ట్ ఫిలిమ్ క్షణం. కానీ రిలీజైంది మాత్రం సోగ్గాడే చిన్ని నాయనా. అదీ కూడా నాగ్ సార్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అవ్వడం...50 కోట్ల క్లబ్ లో చేరడం...ఇందులో నేను బుజ్జి పాత్ర పోషించడం చాలా సంతోషంగా ఉంది. చేసింది చిన్న పాత్రే అయినా మంచి పేరు లభించింది. ఇండస్ట్రీ నుంచి ఆడియోన్స్ నుంచి సోగ్గాడు చిన్ని నాయనా లో బాగా చేసావ్ అంటూ అభినందనలు రావడం చాలా ఆనందంగా ఉంది.
పవన్ కళ్యాణ్ మూవీలో సాంగ్ చేయమని ఆఫర్ వస్తే కాదనడానికి కారణం ఏమిటి..? నాగార్జున సోగ్గాడే... సినిమాలో చేయడానికి కారణం ఏమిటి..?
పవన్ కళ్యాణ్ గారి మూవీలో ఓ పాటలో నటించే అవకాశం వచ్చింది కానీ...కేవలం పాటకే పరిమితం కావడం ఇష్టం లేక చేయలేదు. ఇక సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో చేయడానికి కారణం అంటే చిన్నప్పటి నుంచి నాగ్ సార్ అంటే ఇష్టం. పైగా ఈ సినిమాలో పాటతో కొన్ని సీన్స్ కూడా ఉండడంతో నటించాను.
క్షణం సినిమాలో అవకాశం ఎలా వచ్చింది..?
అడవి శేషు క్షణం సినిమా గురించి ఒక రోజు మెసేజ్ పెట్టారు. అప్పుడు నేను యు.ఎస్ లో దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ప్రొగ్రామ్స్ కి హోస్ట్ గా చేస్తున్నాను. ఆతర్వాత శేషు ఈ సినిమా కథ నాకు మెయిల్ లో పంపించారు కానీ నేను అంత సీరియస్ గా తీసుకోలేదు. ఎందుకంటే నాకు అప్పుడు సినిమాల్లో నటించాలని కూడా అంతగా లేదు. అయితే ఇండియాకి వచ్చిన తర్వాత ఓరోజు కాఫీ షాప్ లో అనుకోకుండా శేషు కలిసాడు. అప్పుడు స్టోరీ వినమని కథ చెప్పాడు. విన్న వెంటనే నాకు చాలా బాగా నచ్చేసింది. ఈ సినిమాలో నన్ను శ్వేతా క్యారెక్టర్ కి అడుగుతున్నారనుకున్నాను. కానీ..ఎ.సి.పి క్యారెక్టర్ కోసమని చెప్పారు. నన్ను ఎ.సి.పి క్యారెక్టర్ కోసం అనుకోవడం ఏమిటి అనుకున్నాను. కాకపోతే కథ బాగుంది ఇందులో నేను ఓ పార్ట్ అవ్వాలనిపించింది. అంతే కాకుండా ఎ.సి.పి జయ భరద్వాజ్ క్యారెక్టర్ అనేది కెరీర్ బిగినింగ్ స్టేజ్ లో రాదు. అనసూయలో యాంకర్ మాత్రమే కాదు మంచి నటి కూడా ఉంది అని నిరూపిద్దామని ఈ సినిమా చేయడానికి ఓకె చెప్పాను.
క్షణం రెగ్యులర్ స్టోరీ కాదంటున్నారు..అసలు క్షణం కథ ఏమిటి..?
రియా అనే చిన్న పాప చుట్టూ తిరిగే కథ. రియాని కిడ్నాప్ చేస్తారు. ఆ కిడ్నాప్ డ్రామా ఎలా సాగుతుంది అనేది చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. రియా దొరకుతుందా లేదా అసలు రియా ఉందా లేదా అని తెలుసుకోవడమే క్షణం కథ.
మీరు ఎ.సి.పి క్యారెక్టర్ చేయగలను అనుకున్నారా..?
ఈ క్యారెక్టర్ నేను చేయగలనని అసలు కాన్పిడెన్స్ లేదు. కాకపోతే చిన్నప్పటి నుంచి ఏదైనా సాధించగలననే తత్వం నాలో ఉంది.
ఆతత్వమే నేను ఈ క్యారెక్టర్ చేసేలా చేసిందని నమ్ముతున్నాను. ఏది జరిగినా మన మంచికే అంటారు కదా అలా క్షణం చేయడం నా మంచికే జరిగిందని నా నమ్మకం.
హీరోయిన్ పోలీస్ క్యారెక్టర్ చేస్తుందంటే మనకు ఠక్కున గుర్తుకు వచ్చేది విజయశాంతి. మీరు ఫస్ట్ టైం పోలీస్ గా నటించాలి అన్నప్పుడు ఆ క్యారెక్టర్ కో్సం హోమ్ వర్క్ ఏమైనా చేసారా..?
మీరు చెప్పినట్టు హీరోయిన్ ఎవరైనా పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నారంటే విజయశాంతి గారే గుర్తుకువస్తారు. ఈ సినిమాలో నేను అసలు పోలీస్ యూనిఫార్మ్ వేసుకోను. ఇక హోమ్ వర్క్ అంటే చేసాను కానీ సినిమాలు చూడలేదు. ఎందుకంటే ఏ సినిమా అయినా చూస్తే అందులో క్యారెక్టర్ ప్రభావం నాపై ఉంటుందని. కాకపోతే డైలాగ్స్ బాడీ లాంగ్వేజ్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాను.
బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చారు కదా..ఈ మార్పు ఎలా అనిపించింది..?
బుల్లి తెరకు వెండితెరకు నాకు పెద్ద తేడా ఏమీ లేదు. ఉన్న తేడా ఏమిటంటే...బుల్లితెర అయితే షో అంతా నా పైనే ఉంటుంది. అదే వెండితెర అయితే చాలా మంది ఉంటారు.
మీరు నటించిన సోగ్గాడు...అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించింది. క్షణం పి.వి.పి సంస్థ నిర్మించింది. బిగ్ బ్యానర్స్ లోనే వర్క్ చేస్తారా..?
కెరీర్ బిగినింగ్ లోనే అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ పి.వి.పి సంస్థలో నటించడం చాలా ఆనందంగా ఉంది. పెద్ద బ్యానర్స్ లోనే చేస్తాను అని అనను కానీ... కథ అందులో నా క్యారెక్టర్ నచ్చితే చిన్న బ్యానర్ లో అయినా చేస్తాను.
మీ ప్రాధాన్యత బుల్లితెరకా..? వెండితెరకా..?
బుల్లితెర వల్లే నాకు పేరు వచ్చింది కాబట్టి బుల్లితెరను వదలను. బుల్లితెర - వెండితెర రెండింటిలో చేస్తాను.
యాంకర్ అయ్యారు..సినిమాల్లో స్పెషల్ క్యారెక్టర్స్ చేస్తున్నారు...నెక్ట్స్ మీ టార్గెట్ హీరోయిన్ అవ్వడమేనా..?
హీరోయిన్ అవ్వాలనే టార్గెట్ ఏమీ పెట్టుకోలేదు. ప్రేక్షకులు నన్ను హీరోయిన్ గా చూడాలనుకుంటే నాకు అలాంటి అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. అలాగే పాత్ర నిడివి ఎంత అనేది చూడను నటించడానికి ఎంత అవకాశం ఉంది అనేదే చూస్తాను. ఫైనల్ గా మంచి నటి అనిపించుకోవాలి అంతే.
గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి కామెంట్స్ చేయడం కామన్. కానీ..మీరు కామెంట్స్ కి ఎందుకు రియాక్ట్ అవుతుంటారు..? వార్తల్లో ఉండడం కోసమా..?
అప్పుడప్పుడు ఆలోచిస్తుంటాను రియాక్ట్ అవ్వాలా వద్దా..అని. కాకపోతే నన్ను కామెంట్ చేస్తే పట్టించుకోను. కానీ నా ఫ్యామిలీ మెంటర్స్ అంటే మాత్రం తట్టుకోలేను రియాక్ట్ అవుతాను. అంతే కానీ...కావాలని వార్తల్లో ఉండడం కోసం రియాక్ట్ అవ్వను.
ఐటం సాంగ్ చేసే ఆలోచన ఉందా..?
నా ఏక్టింగ్ తో పాటు వచ్చే సాంగ్ అయితే చేస్తాను కానీ కేవలం ఐటం సాంగ్ అంటే మాత్రం ప్రస్తుతం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. క్షణం సినిమా చేసాకా నా నటనపై నమ్మకం పెరిగింది. అందుచేత ఇప్పుడిప్పుడే ఐటం సాంగ్ కి రెడీగా లేను.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?
ప్రస్తుతం ఫోర్ ప్రాజెక్ట్స్ డిష్కషన్స్ స్టేజ్ లో ఉన్నాయి. త్వరలోనే పూర్తి వివరాలు తెలియచేస్తాను.