స్టార్ మా లో 'కామెడీ స్టార్స్ ధమాకా' !!
- IndiaGlitz, [Sunday,January 23 2022]
కామెడీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లేలా.. నవ్వించడంలో ఒక కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుడుతూ స్టార్ మా కామెడీ స్టార్స్ ని కొత్త గా తీర్చి దిద్దింది.
కామెడీ స్టార్స్ ధమాకా పేరుతో ప్రేక్షకులకు ఆదివారం మధ్యాహ్నాల్ని వినూత్నం చేయబోతోంది. ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ హంగామా స్టార్ మా ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్నిఅందించేందుకు ఫార్మాట్ లో వినూత్నమైన మార్పులు చేసింది. .కామెడీ స్టార్స్ లో కనిపించి నవ్వించిన స్టార్స్ తో పాటు అదనంగా ఇంకెందరో మీ అభిమాన కమెడియన్స్ తమ కొత్త స్టైల్స్, కొత్త టైమింగ్స్ ఇప్పుడు మరిన్ని రెట్లు కామెడీ అందించబోతున్నారు.
టెలివిజన్ లో కామెడీ అనగానే గుర్తొచ్చే ఎందరో కమెడియన్స్ కామెడీ స్టార్స్ ధమాకా లో స్టార్ మా ప్రేక్షకులను కామెడీ ప్రపంచంలోకి తీసుకువెళ్లబోతున్నారు. కామెడీ తో తలబడబోతున్న టీమ్స్ మధ్య జరగబోతున్న పోటీ మరింత రసవత్తరంగా వుండబోతోంది. కామెడీ స్టార్స్ ధమాకా - స్టార్ మా తమ అభిమాన ప్రేక్షకులకు అందిస్తున్న కామెడీ కానుక !!
కామెడీ స్టార్స్ ధమాకా ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Content Produced by: Indian Clicks, LLC